Loading...
You are here:  Home  >  Politics  >  Andhra Politics  >  Current Article

12 Days Holidays For School – AP Govt

By   /  July 30, 2016  /  Comments Off on 12 Days Holidays For School – AP Govt

    Print       Email

ap map12 రోజులు సెల‌వులే..!  

ఆంధ్ర‌ప్ర‌దేశ్ ప్ర‌భుత్వం కృష్ణా పుష్క‌రాల‌ను ఘ‌నంగా నిర్వ‌హించేందుకు ఏర్పాట్లు చేస్తున్నారు. అందులో భాగంగానే ప్ర‌భుత్వ యంత్రాగాన్ని స‌ర్కార్ ఇప్ప‌టికే విజ‌య‌వాడ‌లో మోహ‌రించింది. ఆగస్టు 12 నుంచి 23 వరకు జరగనున్న నేపథ్యంలో విజయవాడ కార్పొరేషన్‌, పుష్కర ఘాట్ల పరిధిలోని ప్రభుత్వ, ప్రయివేటు విద్యాసంస్థ లకు సెలవులు ప్రకటించాల్సిందిగా ప్రభుత్వం విద్యాసంస్థలను ఆదేశించింది. ఈమేరకు ఉన్నత విద్యాశాఖ ముఖ్యకార్యదర్శి సుమితా దావ్రా ఉత్త ర్వులు విడుదల చేశారు. ఒక్క కృష్ణా జిల్లా పరిధిలోనే పుష్కరాలకు సుమారు మూడున్నర కోట్ల మంది భక్తులు వస్తారని అంచనా. జిల్లాలోని విద్యాసంస్థల్లో పుష్కర విధులు నిర్వహించే సిబ్బంది వసతి కల్పించేందుకు ఆగస్టు 8 నుంచి 25 వరకు సెలవులు ప్రకటించాలని కలెక్టర్‌ ప్రభుత్వానికి ప్రతిపాదించారు.

InCorpTaxAct
Suvidha

అయితే పుష్కరాలు జరిగే 12 రోజులు జిల్లాలోని విద్యాలయాలకు సెలవులు ప్రకటించి, సెలవు దినాల లోటును భర్తీ చేసేందుకు పని దినాలను నిర్వహించుకునే బాధ్యత ఆయా యాజమాన్యాలకు అప్పగిస్తున్నట్లు ఉత్తర్వుల్లో పేర్కొన్నారు. అయితే భ‌క్తుల్లో మాత్రం గ‌త ఏడాది జ‌రిగిన తొక్కిస‌లాట‌ను మాత్రం మ‌రిచిపోలేక‌పోతుండ‌డం విశేషం.

InCorpTaxAct

If you like to publish news or your story on our website, please email to editor 'at' deccanabroad.com.


    Print       Email

You might also like...

Vanisri Birthday Special on SakshiTV : Aug 3rd 2:30 PM EDT

Read More →