Loading...
You are here:  Home  >  Daily News  >  Current Article

15 mbps of Internet to 1 Crore Homes in Telangana: KTR

By   /  March 26, 2018  /  Comments Off on 15 mbps of Internet to 1 Crore Homes in Telangana: KTR

    Print       Email

15 ఎంబీపీఎస్ స్పీడ్‌తో కోటి ఇళ్ల‌కు ఇంట‌ర్నెట్‌

InCorpTaxAct
Suvidha

 

 

 

 

* రాష్ట్ర‌మంత‌టా ఆప్టిక్ ఫైబ‌ర్ కేబుళ్లు

* జీహెచ్ఎంసీకి నీటి కొర‌త లేదు

* మంత్రి తార‌క‌రామారావు

డెక్క‌న్ అబ్రాడ్‌:  తెలంగాణ రాష్ట్రంలో 15 ఎంబీపీఎస్ స్పీడ్‌తో కోటి ఇళ్ల‌కు ఇంట‌ర్నెట్ అందిస్తామ‌ని మంత్రి తార‌క‌రామారావు అన్నారు. ఈ ఏడాది డిసెంబ‌ర్ నాటికి ఆ ప్ర‌క్రియ పూర్త‌వుతుంద‌న్నారు.  రాష్ట్రంలోని 8,700 గ్రామపంచాయతీల్లోని వ్యవస్థలకు 1 జీబీపీఎస్ స్పీడ్‌తో ఇంటర్నెట్ అందించనున్నట్టు తెలిపారు. ఈ పద్ధతి ద్వారా కేబుల్ ఆపరేటర్లకు, ఎంఎస్‌వోలకు ఎలాంటి ఇబ్బంది తలెత్తదన్నారు. జీహెచ్‌ఎంసీ పరిధిలో తాగునీటి కొరత లేదని, ఆందోళన చెందాల్సిన అవసరం లేదని మున్సిపల్ పరిపాలన, పట్టణాభివృద్ధి శాఖ మంత్రి కేటీఆర్ స్పష్టం చేశారు. జీహెచ్‌ఎంసీలో నీటి సరఫరా అంశంపై సయ్యద్ అమినుల్ హసన్ జాఫ్రీ వివరణ కోరగా మంత్రి సమాధానమిస్తూ… మొత్తం 537.24 ఎంఎల్ సామర్థ్యంతో జీహెచ్‌ఎంసీ ప్రాంతంలో 236 రిజర్వాయర్లు లభ్యంగా ఉన్నాయన్నారు. జీహెచ్‌ఎంసీ ప్రాంత కైవార ప్రాజెక్టులో 56 నూతన సర్వీసు రిజర్వాయర్లు ప్రతిపాదించినట్టు పేర్కొన్నారు. ఇప్పటివరకు 44 సర్వీసు రిజర్వాయర్లను పూర్తి చేశామని, మిగిలిన 12 తుది దశలో ఉన్నాయన్నారు. గ్రేటర్ హైదరాబాద్‌లో అవసరమైన మౌలిక సదుపాయాలను కల్పించేందుకు ప్రధాన నగరంలో, కైవార సర్కిళ్లలో నూతన నిల్వ రిజర్వాయర్లను నిర్మించడానికి, ఫీడర్‌మెయిన్లను వేయడానికి, ఔట్‌లెట్, పంపిణీ కాలువల ఏర్పాటుకు నీటి సరఫరా మెరుగుదల ప్రాజెక్టులను చేపట్టినట్టు తెలిపారు.

హైదరాబాద్ కోసం నీటి సరఫరాను పెంచడానికి గోదావరి నది వనరు నుంచి హైదరాబాద్ వరకు అదనపు 172 ఎంజీడీ నీటిని తీసుకునిరావడానికి 10 టీఎంసీ నిల్వ రిజర్వాయరు నిర్మాణం, 172 ఎంజీడీ శుద్ధీకరణ ప్లాంట్, 3600 ఎంఎం డయా గ్రావిటీ మెయిన్స్, 3000 ఎంఎం డయా పంపింగ్ మెయిన్, పంప్‌హౌజ్, పంప్స్ అండ్ మోటార్స్, మాస్టర్ బ్యాలెన్సింగ్ రిజర్వాయర్లు వంటి అంశాలతో కేశవాపురం, షామీర్‌పేట వద్ద మరో వనరు ప్రాజెక్టును చేపట్టినట్టు తెలిపారు. ఈ నీటి సరఫరా ప్రాజెక్టుల కోసం ఏటా రూ. 60 కోట్లకు పైగా ఖర్చు అవుతుందన్నారు. వాటర్‌బోర్డు నష్టాల్లో ఉందన్నారు. జీహెచ్‌ఎంసీ పరిధిలో 40 శాతం ఎన్‌ఆర్‌డబ్య్లూ (నాన్ రెవెన్యూ వాటర్) వినియోగదారులున్నారని అందుకే బోర్డుకు నష్టాల్లో ఉందన్నారు. సౌతాఫ్రికా కేప్‌టౌన్‌లో ఇటీవల నీటి కొరత తీవ్రంగా అయిందని, బెంగుళూరు కూడా ఆ వైపుగా ప్రయణిస్తుందన్నారు. అందుకు హైదరా బాద్‌కు నీటి కొరత రాకుండా ముందస్తు జాగ్రత్తలు తీసుకుం టున్నామన్నారు. ఇందులో భాగంగానే ఓఆర్‌ఆర్ చుట్టూ రింగ్ మెయిన్ ద్వారా కృష్ణా, గోదావరి జలాలను ఇంటర్ కనెక్టెడ్ గ్రిడ్‌ను ఏర్పాటు చేస్తున్నామన్నారు. దీంతో జీహెచ్‌ఎంసీకి శాశ్వతంగా నీటి కొరత ఉండ దన్నారు.

InCorpTaxAct

If you like to publish news or your story on our website, please email to editor 'at' deccanabroad.com.


    Print       Email

You might also like...

GATeS 15 th Anniversary and Telangana Formation Day Celebrations

Read More →