ఫ్రాన్స్ లో 22 మంది భారత టీనేజర్లు మిస్సింగ్..
ఫ్రాన్స్ వెళ్లిన 22 మంది భారత్ కు చెందిన టీనేజర్లు మిస్ అయ్యారు. వారు ట్రావెల్ ఏజెంట్స్ కు 25 లక్షల నుంచి 30 లక్షలు చెల్లించి అక్కడకు వెళ్ళారని తెలుస్తోంది. టీనేజర్లు అంతా పంజాబ్, హర్యానా, ఢిల్లీ సహా పలు ప్రాంతాలకు చెందిన వారని సమాచారం. వీరు రగ్బీ ట్రైనింగ్ పేరు చెప్పి ఫ్రాన్స్ వెళ్లినట్లుగా రికార్డుల్లో ఉంది. వీరిని ఫరీదాబాద్ కు చెందిన లలిత్ డేవిడ్, ఢిల్లీకి చెందిన సంజీవ్ రాయ్, వరుణ్ చౌదరీ ఫ్రాన్స్ కు పంపించారు.
ఫ్రాన్స్ లో జరిగే రగ్బీ ట్రైనింగ్ క్యాంప్ కోసమని వీసా దరఖాస్తుల్లో ఉంది. వీరిలో 22 మంది ఆచూకీ తెలియరావడం లేదు. ఇక వీరి ఆచూకీని కనిపెట్టేందుకు రంగంలోకి దిగిన సీబీఐ, కేసు నమోదు చేసింది. అలాగే ట్రావెల్ ఏజంట్ల కార్యాలయాల్లో సోదాలు నిర్వహించి కీలక డాక్యుమెంట్లను స్వాధీనం చేసుకుంది. టీనేజర్ల మిస్సింగ్ పై భారత అధికారులు ఫ్రాన్స్ అధికారులతో చర్చిస్తున్నారు.
If you like to publish news or your story on our website, please email to editor 'at' deccanabroad.com.