25 మంది ఎమ్మెల్యేలు బ్లాక్ లిస్టు లో చేరిపోయారు. అదికూడా సీఎం కేసీఆర్ జాబితాలో. అదేంటి సొంత పార్టీ ఎమ్మెల్యేలను కేసీఆర్ ఎలా బ్లాక్ లిస్టు లో పెట్టుకుంటారనే కదా మీ సందేహం. ఇది నిజమే. టీఆర్ఎస్ ప్రభుత్వం వచ్చి దాదాపు రెండేళ్ళు కావొస్తుంది. ఈ రెండేళ్లలో ప్రభుత్వ పాలన ఎలా వుంది. మంత్రులు ఎలా పనిచేస్తున్నారు. ఎమ్మెల్యేల పని తీరు ఎలా ఉంది. తెలుసుకునే ప్రయత్నం లో బాగంగా ముఖ్యమంత్రి కేసీఆర్ సర్వే చేయించారని సమాచారం. మంత్రుల విషయం లో సంతృప్తి గానే వున్న కేసీఆర్ ఎమ్మెల్యేల వ్యవహారం లో మాత్రం అసంతృప్తి తో ఉన్నారట. ఆయనే స్వయంగా కొద్ది మంది మంత్రులతో చెప్పారని సమాచారం. ప్రస్తుతం టీఆర్ఎస్ కు మొత్తం 87 మంది ఎమ్మెల్యేలున్నారు. అందులో కెసిఆర్ తో కలిపి 18 మంది మంత్రులు. మిగిలింది 76 మంది ఎమ్మెల్యేలు.
ఇందులో కేసీఆర్ బ్లాక్ లిస్టు లో చేరింది 25 మంది ఎమ్మెల్యేలు. ఈ చర్చ ఇప్పుడు అధికార పార్టీ లో హాట్ టాపిక్ అయ్యింది. కేసీఆర్ బ్లాక్ లిస్టు లో వున్న 25 మంది ఎమ్మెల్యేలెవరని గజగజ వనుకుతున్నారు. మహబూబ్ నగర్ జిల్లాకు చెందిన ఒక ఎమ్మెల్యే, నల్గొండ జిల్లాకు చెందిన ఇద్దరు ఎమ్మెల్యే లు, రంగా రెడ్డి కి చెందిన ఒక ఎమ్మెల్యే తో సహా ఈ మధ్య కాలం లో బెదిరింపు ఆడియో టేపులతో సంచలనం సృష్టించిన ఎమ్మెల్యే ల పేర్లు ఉన్నట్లు సమాచారం. టీఆర్ఎస్ లో చేరిన టిడిపి, కాంగ్రెస్ ఎమ్మెల్యేల్లో 4 గురు పేర్లు ఈ లిస్టు లో ఉన్నాయట. వరంగల్ కు చెందినా ఎస్టీ ఎమ్మెల్యే పేరు తో సహా అవినీతి ఆరోపణలు, దౌర్జన్యాల ఆరోపణలు వచ్చిన ఎమ్మెల్యే ల పేర్లు సైతం ఉన్నాయని తెలిసింది. కొంత మంది లూస్ టంగ్ చేసే ఎమ్మెల్యేలను సైతం ఈ లిస్టు లో చేర్చారట. కొంత మంది జూనియర్ ఎమ్మెల్యేలు బయటికి బాగానే ఉంటున్నా లోలోపల కేసీఆర్ పై సంతృప్తి వ్యక్తం చేస్తున్నారట. వారి పేర్లు సైతం కేసిఆర్ దృష్టికి వచ్చాయట. రాజ్యాంగబద్ద మైన పదవిలో వున్న ఒక ఉద్యమకారుడు సైతం ఇలాంటి వాఖ్యలు చేస్తున్నారనే విషయం కేసీఆర్ కు తెలిసిపోయిందట. నియోజక వర్గాల్లో ప్రజలతో టచ్ లోని ఎమ్మెల్యేలు సైతం ఈ లిస్టు లో ఉన్నారని సమాచారం. బ్లాక్ లిస్టు లోని ఎమ్మెల్యేలపై కేసీఆర్ ఎలాంటి చర్యలు తీసుకుంటారన్నది చూడాల్సి వుంది. వీరిపై ఓ కన్నేసి ఉంచాలని జిల్లా ఇన్చార్జీలకు కేసీఆర్ చెప్పినట్లు తెలిసింది
Source: Shivareddy Vulupala
If you like to publish news or your story on our website, please email to editor 'at' deccanabroad.com.