Loading...
You are here:  Home  >  World News  >  Asia News  >  Current Article

Article on Ugadi by – Kompella Sarma

By   /  April 7, 2016  /  No Comments

    Print       Email

12920438_456788814520024_7717155352962500621_n“మన్మథ’ మనుగడ నిష్క్రమణం – ‘దుర్ముఖి’ దర్శనం”

‘నీ’ ‘నా’ భేదము లేక తెల్గుదనపున్నీరాజనాలిచ్చుచున్క్

InCorpTaxAct
Suvidha

రానేవచ్చె మరో ‘ఉగాదీ యదిగో! రాగిల్లు నెమ్మోముతో

తేనెల్ జిప్పిలు నవ్వుదొంతరలతో, తీరైన వాల్చూపుతో

మీనట్టింటిని భోగ, భాగ్య, శుభసమ్మేళంబు గావింపగన్.

కాలం – కాలజ్ఞ్తత

కాలం నియంతలా తనదైన శైలిలో, ఉగాది రూపాన ప్రవేశ, నిష్క్రమణలు కావిస్తూంటుంది. ఈ కాలధర్మంలో, కాలజ్ఞతతో, దేవకాలమానంలో, మన మానవుల జీవన పరిణామం ఎంత? క్షణికమైనా, బుద్బుదప్రాయమైనా, నూరు ఉగాది పండుగలను వీక్షించుకునేందుకు మన “శతమానం భవతి” అని మనకు పెద్దలనుంచి శుభాశీస్సులు అందుకోవడం సర్వసాధారణం. ప్రస్తుతం మాత్రం ‘మన్మథ’ మనుగడ మాత్రం కనుమరుగవుతోంది. ఏడాదిపాటు మనందరితో సమాగమం చేస్తున్న ‘మన్మథ’ యుగాది యికపైనుంచి ‘దుర్ముఖి’గా దర్శనం యిస్తోంది. ఉగాది పేరు ఏదైనా ఉగాదికి స్వాగతం పలుకకుండా మనలేం అన్నది సత్యం. ప్రకృతి, ప్రాభవాన్ని దర్శించుకంటూ మనందరికీ సుఖానందభూతుల్ని, ఆరోగ్యాన్ని అందిస్తుందని ఆశిస్తూ నవ్య ఉగాదికి స్వాగతాన్ని పలుకుదాం.

కాలానికి నిజానికి యెల్లలంటూ లేవు. దానికి ఆది లేదు, అంతమూ లేదు. ఆద్యంతరహితమైన అనంత ప్రవాహంవంటిది కాలం. నిమిషాలు, గంటలు, రోజులు, వారాలు, నెలలు, సంవత్సరాలు; ఇవన్నీ కాల ప్రవాహంపై లేచి, తిరిగి దానిలోనే కలిసిపోయే చిన్ని, పెద్ద కెరటాలు. వీటిపై కొంత దూరం పయనించి, వీటితోపాటు తిరిగి కాలగర్భంలో కలసిపోయేవాడే మానవుడు. కనుకనే అతడి దౄష్టి సహజంగా ఆ కెరటాలపైనే. గడియారాలతో వాటిని కొలవడానికి మానవప్రయత్నం జరుగుతుంది. పంచాంగాలతో వాటి నడక తీరులను నిర్ణయించడానికి మానవులు తహతహలాడతారు. శకాలని, యుగాలని నాటి వర్గీకరణకు ప్రయత్నాలు నిత్యం జరుగుతూనే యుంటాయి. దీన్ని షుష్కయత్నంగా వేదాంతులు నిరసించవచ్చు; వౄధాష్రమగా తత్వజ్ఞులు నిందించవచ్చు. కాని, జీవితమాధుర్యం దీనిలోనే వున్నది; జీవితసాఫల్యమూ దీనిలోనేవున్నది.

ఏ యుగంలోనైనా, ఏ శతాబ్దంలోనైనా, తుదకు ఏ సంవత్సరంలోనైనా మంచిచెడ్డలు, వృద్ధిక్షయాలు మిశ్రమంగానే వుంటాయి. ఈ ద్వంద్వాలలో ఒకప్పుడు ఒకటి రెండవదానికంటే ఒక పాలు ఎక్కువ కావచ్చు; లేక తక్కువ కావచ్చు. అంతే తప్ప, సమస్తం మంచికాని, కేవలం చెరుపుకాని, పూర్తిగా అభివృద్ధికాని, పూర్తి క్షయంకాని ఎప్పుడూ వుండదు.

అన్ని రోజులెట్టివో, పండుగరోజు లట్టివే. ఒక రోజు పండుగరోజు కావడానికి దానికి మనం ఆపాదించుకునే ప్రత్యేకతే కారణం, దానికి మనం సమకూర్చుకునే వైశిష్ట్యమే కారణం. ఇదే శకాలకు కూడా వర్తిస్తుంది. ఒకటి పాతశకం కావడం, మరొకటి కొత్తది కావడం, ఓకటి అంధకారభరితమైనది కావడం, మరొకటి మహోజ్జ్వలమైనది కావడం, కాలగతిపై ఆధారపడి వుండదు. శకాల స్వరూపాన్నీ, స్వభావాన్నీ నిర్ణయించేది కేవలం మానవప్రయత్నమె. మానవుడు మార్పు చెందనంతవరకు అది పాతశకం; మార్పు చెందితే అది నవశకం. అతడు అభ్యుదయపథాల మెట్టిదే, అది మహాశకం; అధోగతి పాలైతే అది హీనశకం.

పండుగలన్నీ సంవత్సరాని కొకసారి చొప్పున తిరిగి, తిరిగివచ్చేసే, అంతమాత్రం చేత వాటి అర్ధం తగ్గదు; అందం తగ్గదు; ఆనందం తగ్గదు; ప్రతి సంవత్సరం వచ్చేది కనుక వసంతం విలాసం తగ్గుతుందా? ప్రతి నెల వచ్చేది కనుక పూర్ణిమ శోభ తగ్గుతుందా? పౄకౄతి విలాసాలలోని నిత్యనూతనత్వం జాతీయ పర్వదినాలలో కూడా వుంటుంది. పైగా, మన ప్రధాన పర్వదినాలకు పౄకౄతివిలాసాలతో సన్నిహిత సంబంధం వున్నదికూడా. ఉదాహరణకు లేత చిగుళ్ళను, కొత్తపూవులను సంగారించుకొని వొయ్యారంగా వచ్చే వసంతునికి మనం పట్టే ముత్యాలగొడుగు – సంవత్సరాది.

ఏమైనా, జీవితాన్ని రోసినవారికి ఉగాది తక్కిన రోజులతోపాటు మరొక రోజు మాత్రమే కావచ్చు గాని, బ్రతుకును ఒక మహావరప్రసాదంగా భావించేవారికి మాత్రం ఉగాది కెంతో వైశిష్ట్యం వున్నది. అది మోడు మొక్కలనే కాక, వాడి వత్తలైన గుండెలను సహితం చిగురించజేస్తూ వస్తుంది. కొత్త పూబిందెలతో పాటు కొత్త ఆశలను, ఆనందాన్ని వెంటబెట్టుకు వస్తుంది. తియ్య మామిళ్ళతో పాటు తేనె పాటలు అందిస్తూ వస్తుంది. నిరుటి ఆశాభంగాలను, నిరుటి ఆవేదనలను తుడిచివేస్తూ వస్తుంది. కొత్త జీవితానికి ఆహ్వానాన్ని చేబట్టుకు వస్తుంది. యించువల్లనే అన్ని పండుగలలో ఉగాది మొదటిది మాత్రమే కాదు; అన్నిటికంటె గొప్పది కూడా!

తెలుగువారి పండుగలు

తెలుగునాట పండుగలు – పబ్బాలు, నోములు, వ్రతాలు, ఉత్సవాలు, ఊరేగింపులు, జాతరలు, కొలువులు తరతరాలుగా సమాజంలో నివివిధవర్గాలవ్యక్తుల్ని ఒక్కచోట చేరుస్తున్నాయి. ఎక్కువమంది పాల్గొనకపోతే పండుగలకు కాని, ఉత్సవాలకు కాని, ఇలాంటి మరే సాంఘికాచారాలకు కాని ‘కళాకాంతులూ రావు. యిటువంటి ఉత్సవ సంప్రదాయాలను గురించిన ఉల్లేఖనాలు తెలుగు కావ్యాలలో పెక్కుచోట్ల కనిపిస్తూ, వీటి చరిత్ర సుదీర్ఘమైనదని నిరూపిస్తున్నాయి. ‘శివరాత్రి మాహాత్మ్యం’లో వివిధ ౠతువులలో వచ్చే పండుగవర్ణనలు – నాగులచవితి, రధసప్తమి, మకరసంక్రాంతులు, ‘సిహాసనత్వాత్రింశికాలో దివ్వెల పండుగ, ‘పండితారాధ్యచరిత్రాలో పాల్కురికి సోమనాధుడు – దవన(ఏరువాక), నూలి (శ్రావణ) పూఋర్ణిమ పండుగలను, కాకతీయుల కాలంలో శ్రీకాకుళం తిరునాళ్ళ ప్రస్తిద్ధతను ‘క్రీడాభిరామం’లో శ్రీనాధుడి ప్రస్తావన, తేలంగాణాలో నేటికీ దివిలి, పున్నమకు, అమావాస్యకు చేసే పూజలు,పండుగలు అనేకం సదాచార, సంప్రదాయాల్ని విశదపరుస్తున్నాయి. సంప్రదాయాలు లేకుండా ప్రయోగాలు, ప్రయోజనాలు లేవు. ఆదిలో లేనిది అంత్యంలో లేదు. తరతరాలుగా జనసమూహంలో నిలిచి ఉన్న నమ్మకాలు, సంప్రదాయాలు క్రియారూపాన్ని దాల్చగా పండుగలేర్పడ్డాయి. మొదట ప్రకౄత్యారాధనగా ప్రారంభమై, వ్యవసాయ సంస్కౄతికాలంలో స్పష్టరూపాన్ని పొంది, తర్వాతకాలంలో యింకా క్లిష్టస్వరూపం సంపాందించి, చివర ప్రాచీన ఆచారాల సూచ్యగుణాన్ని మాత్రంకలిగి ఉత్సాహాన్ని, ఉల్లాసాన్ని కలిగించేవిగా పండుగలు రూపొందాయి. ‘సాంఘిక సంక్షేమంకోసం విశేష సందర్భాలలో జానపద విశేషాలు, సంప్రదాయాల కలబోతగా ఆచరించే సంక్లిష్టమైన ఆంశమే పండుగ”. పండుగలు ఏ విధంగా అవతరించాయి. ఎప్పుడు ఉద్భవించాయి, ఎందుకు, తిధుల ప్రవేశాల్లోనా లేక నిష్క్రమణాల వేళల్లో జరుపుకోవాలి అనే సిద్ధాంతుల తర్కాలకు కూడా అంతుచిక్కని రాజకీయపు అనూహ్యస్థితి-దుస్థితిగతులా అనే ప్రశ్నలకు సమాధానాలను రాబట్టడం చాలా కష్టం. ప్రకౄతికి సంబంధించిన పండుగలు, వ్యవసాయానికి సంబంధించిన పండుగలు చాలా ప్రాచీనమైనవని చెప్పవచ్చుగాని, ఖచ్చితంగా ఏ దశలో అవి వెలువడ్డాయని చెప్పడమూ కష్టమే. చాలా వరకు పండుగలకు మూలం ప్రాచీన కాలపు కర్మకాండలనడంలో సందేహంలేదు. మతం, జనానందం, యుద్ధాలు, సాహసకార్యాలు, అమరవీరులు, ఆత్మబలులు, సంస్మరణలు, జయంతులు, నీతిబోధనలు, ధార్మికుల కోసం కూడా కొన్ని పండుగలు ఉద్భవించాయి.

తెలుగువారి పండుగలను ఒక్కొక్కొసారి ప్రత్యేకంగా వివరించడం కష్టం. ఉత్సవాలు, ఊరేగింపులు, జాతరలు కూడ ఒక విధంగా పండుగలే, నోములు, వ్రతాలు, పండుగలు కావని ఎవరనగలరు? అయినా మనంవాడుకునే పదాలను బట్టి వీటిలోనే కొన్నింటిని పండుగలని, కొన్నింటిని ప్రతాలని, కొన్నింటిని ఉత్సవాలని పిలవడం జరుగుతున్నది. తెలుగువారు పండుగలను ఆచరించేటప్పుడు ఏమేమి చేస్తారు అన్నది కుతూహలాన్ని రేకెత్తిస్తుంది. పండుగలకు మనం చెప్పుకునే ఆచారాలు జానపదులకు, జ్ణానపధులకు, సంబంధించినవే కాని శిష్టులకు సంబంధించినవి కావు. ఎందుకంటే శిష్టుల పాలిటికి చాలా వరకు పండుగలు విలువను కోల్పోతున్నాయి. చివరికి మిగిలింది వేలయితే కొత్తగుడ్డలు కట్టుకోవడం, సుష్టుగా భోజనంచేయడం మాత్రమే. కాని జనపదులకు పండుగ వచ్చిందంటే ఎక్కడలేని సంభ్రమమూ వస్తుంది.

 

12963423_1708463469410526_3669330610442630794_n

చాంద్రమానం

చాంద్రమానం – ఆంధ్రుల పండుగలు చాలావరకు చాంద్రమానాన్ని అనుసరించేవి. కాలాన్ని గణించడానికి మనదేశంలో ఉండిన తొమ్మిదివిధాలలో ముఖ్యమైనవి – చాంద్రమానం, సౌరమానం. ఈ విషయంలో తెలుగువారు, కన్నడిగులు చాంద్రమానాన్ని, తమిళులు సౌరమానాన్ని అనుసరిస్తున్నారు. చాంద్రమానాన్ని అనుసరించే తెలుగువారికి మొదటిపండగ ఉగాది. యుగాదిని కూడా ఉగాదిగా చేసుకొని, అచ్చమైన తెలుగుపండుగలాగే ఆచరించే సంప్రదాయం మనది. యుగాది ఎందరికైనా ఉండవచ్చు. కాని తెలుగువారి ఉగాదికే కొన్ని ప్రత్యేకతలు ఉన్నాయి.

ఉగాది

చైత్ర శుద్ధ పాడ్యమినాటి ఉగాదితో చాంద్రమానాన్ని అనుసరించే, తెలుగువారి క్రొత్తసంవత్సరం ప్రారంభమవుతుంది. ఉగాది అంటే సంవత్సరం ప్రారంభం అని అర్ధం. అందుకే దీన్ని ‘సంవత్సరాదీ అంటారు. యుగాది అనికూడా వ్యవహరిస్తారు. ఈరోజే, విక్రమార్కుడు పట్టాభిషిక్తుడయ్యాడట. అందుచేత ఈనాటినుంచీ, విక్రమార్కశకం/యుగం ప్రారంభమయినట్లు కూడా పేర్కొంటారు. అయితే ఎప్పుడూ ఇలాగే జరుగుతుండినదని అర్ధంకాదు. రామాయణంలో ‘పన్నెండో మాసమైన చైత్రంలో నవమి దినంనాడు శ్రీరాముడు జన్మించాడని చెప్పబడింది. అందువల్ల ఆ కాలంలో వైశాఖమాసం నుంచి క్రొత్తసంవత్సరం ప్రారంభమవుతుండేదని తెలుస్తున్నది. క్రీ.శ. 5వ శతాబ్దిలో వరాహమిహిరుడు చైత్రమాసంనుంచి క్రొత్త సంవత్సరం ప్రారంభమయ్యే సంప్రదాయాన్ని ప్రారంభించాడంటారు. ఆంధ్ర, కర్నాటక, మహారాష్ట్రలలో ఈ దినమే ఉగాదిని పాటిస్తున్నారు.

ఉగాది జీవనంలోని సుఖదు:ఖాలను ప్రతిబింబించే ఉత్తమ పర్వదినం. కన్నడిగులు సుఖదు:ఖాలకు ప్రతీకగా వేపపూలను బెల్లాన్ని కలిపితింటారు. తెలుగువారి ఉగాది పచ్చడి సుఖదు:ఖాలను మాత్రమే కాక జీవితంలోని వగరును, రౌద్రాన్ని, పులుపును కూడా ప్రతిబింబింస్తుంది. పండుగలు సాంకేతికమైనవని చెప్పడానికి తెలుగు వారి ఉగాది పచ్చడి ఒక్కటే చాలు. వేపపూలు, కొత్తబెల్లం, ఉప్పు,కొత్తచింతపండు, పచ్చిమిరపకాయలు, మామిడిపిందెలు – కలిపిన ఉగాది పచ్చడి షడ్రుచులతో వింత అనుభవాన్ని కలిగిస్తుంది. పంచాంగశ్రవణం కూడా ఉగాది పండుగలో ఒక భాగమై పోయింది. పల్లెటూళ్ళలో ఇది కేవలం ఒక ఆచారంగా కాక, రాబోయే శుభాశుభాలను తెలుసుకోవాలనే ఉత్సుకతను రేకెత్తించే సందర్భంగా ఉపయోగిస్తుంది. సంవత్సరం పొడవునా మానవకోటి జీవనసమరంలోని మంచిచెడ్డలు, పాడిపంటలు, వర్షాలతీరు, గ్రహాలస్థితిగతులతో పంచాంగశ్రవణాన్ని పఠించి సందేశాన్ని అందించడం కూడ విశేషం.

నరము నరమున నవనవాభ్యుదయము

ప్రముఖకవి దాశరధి – తనకావ్యం, ‘కవితాపుష్పకం’ లో ఉగాది ప్రాముఖ్యతను ఆశాపూరితమైన భావనానుభూతిని వర్ణిస్తూ, “పాతబడిన ధరణి నూతతత్వము నందవచ్చె నీ నవీన వత్సరమ్ము! ఇంత ముసలి జగతి ఈనాడు యౌవనవంత మగుట యెంతో వింతకాదె?” అంటూ, ‘నా కుగాదినాడు నరము నరమున నవనవాభ్యుదయము నాట్యమాడు, ఈ అశాంతధోరణికి ఎన్నడో ఒకనాడు శాంతినందుననుట భ్రాంతిగాదు” అన్నది తద్ధర్మకాలసంబంధితనానుడి అని చెప్పక తప్పదు.

ఆశాభావం ఎక్కడుంటుందో, అక్కడే నిరాశానుభూతికూడ ప్రభవిస్తుంది. నాణానికి రెండు పార్శ్వాలు – ఆశ, నిరాశ. నిరాశలోంచే ఆశావాదం ఆవరిస్తుంది. ‘నాకుగాదులు లేవు, నాకుషస్సులులేవు. నేను హేమంత కౄష్ణానంత శఋర్వరిని, నాకు కాలమ్మొక్కటే కారురూపు, నాశోకమ్ము వలెనే, నా బ్రతుకు వలె, నావలెనె” అన్నారు ప్రముఖభావసహజ కవి ‘దేవులపల్లి కౄష్ణశాస్త్రీ తన కౄష్ణపక్షం కావ్యంలో.

శ్రీ యుగాది వేంచేసెను శ్రీకరముగ రమ్ము రారమ్ము వేగ, పిండివంటల భుజియించి ప్రీతితోడ మంగళమ్ముల మాకు నొసంగు దేవ”.

అంతటి నిరాశావాదమే, అదే కలం ‘స్వస్తి జగత్తునకగు, శ్రీరస్తు సదాశాంతిరాస్తటంచు వెలయు, విశ్వస్తుత భారతావాణి సుమస్తబకమువోలె లోకమస్తకము పయిన్” అన్నారు.

విరోధి నుంచి వికౄతి

ప్రభవాది సంవత్సరాల్లో ఒక సంవత్సరం ” విరోధీ అని భయపడుతూంటే, నేను తక్కువేమిటి అన్నట్లు ‘వికౄతీ ప్రవేశిస్తున్న శుభ తరుణం యిది. వికౄతికి వినయ వివేక భరితంగా వివాదరహితంగా స్వాగతం పలుకుదాం!

కొంపెల్ల శర్మ – తెలుగురధం.

Author:  Kompella Sarma

 

11108946_10153412829974697_6519422611442319048_n

InCorpTaxAct

If you like to publish news or your story on our website, please email to editor 'at' deccanabroad.com.


    Print       Email

Leave a Reply

You might also like...

Vanisri Birthday Special on SakshiTV : Aug 3rd 2:30 PM EDT

Read More →