Loading...
You are here:  Home  >  Featured News  >  Current Article

4 Kidney’s found in one body

By   /  June 6, 2016  /  Comments Off on 4 Kidney’s found in one body

    Print       Email

kidneyఒక‌రిలో నాలుగు కిడ్నీలా?

 

InCorpTaxAct
Suvidha

 

 

ఒక మ‌నిషిలో ఎన్ని కిడ్నీలు ఉంటాయంటే ట‌క్కున రెండు అని ఎవ‌రైనా స‌మాధానం చెబుతారు. ఇప్ప‌టి వ‌ర‌కు మ‌నం విన్న‌ది.. చ‌దువుకున్న‌ది అదే క‌నుక‌. అయితే అది త‌ప్పు అని ఒక మ‌నిషిలో రెండుకంటే ఎక్కువ కూడా ఉంటాయ‌ని తాజాగా జ‌రిగిన సంఘ‌ట‌న‌ను బ‌ట్టి తెలుస్తోంది. వివ‌రాల్లోకి వెళ్లితే… చైనాలో షియోలిన్ అనే 17 ఏండ్ల బాలికకు నాలుగు కిడ్నీలు ఉండటం వైద్యులను ఆశ్చర్యానికి గురిచేసింది. వెన్ను నొప్పితో బాధపడుతున్న ఆ యువతి సర్జరీ కోసం హాస్పిటల్‌కు వెళ్లిన సందర్భంగా ఈ అరుదైన విషయం బయటపడింది. బాధితురాలికి అల్ట్రాసౌండ్ పరీక్ష జరుపుతుండగా ఈ నాలుగు కిడ్నీలను వైద్యులు గుర్తించారు. మనుషుల్లో నాలుగు కిడ్నీలు ఉండటం ఓ వ్యాధి అని.. దానిని రీనల్ డూప్లెక్స్ మానస్ట్రోసిటీ అంటారని వైద్యులు పేర్కొన్నారు. ప్రతీ 1500 మందిలో ఒకరికి ఈ అరుదైన వ్యాధి ఉంటుందని, కొంతమందికి ఈ సమస్య ఉన్నట్టు తమ జీవితకాలంలో ఎప్పడూ తెలిసే అవకాశముండదని అన్నారు.

మ‌నిషిలో అదనంగా ఉండే కిడ్నీల వల్ల పెద్దగా ప్రయోజనం ఉండదని, ఎవరికైనా అవసరమున్నట్లయితే దానం చేయడానికి అవకాశముంటుందని వైద్యులు తెలిపారు. షియోలిన్‌కు ఉన్న అదనపు కిడ్నీలను యురేటరల్ రీప్లాంటేషన్ సర్జరీ అనే ప్రత్యేక సర్జరీ ద్వారా తొలగించారు. కాగా ఇక్క‌డో ముఖ్య విష‌య‌మేమిటంటే ప్ర‌తి 1500 మందిలో ఒక‌రికి ఇలాంటి వ్యాధి ఉంటుంద‌ని చెప్ప‌డ‌మే ఆందోళ‌న క‌లిగిస్తోంది.

InCorpTaxAct

If you like to publish news or your story on our website, please email to editor 'at' deccanabroad.com.


    Print       Email

You might also like...

Vanisri Birthday Special on SakshiTV : Aug 3rd 2:30 PM EDT

Read More →