Loading...
You are here:  Home  >  Daily News  >  Current Article

40 MLA’s are against Palaniswamy..?

By   /  February 17, 2017  /  Comments Off on 40 MLA’s are against Palaniswamy..?

    Print       Email

palani-swamyపళనీస్వామి వర్గానికి పెద్ద షాక్..? 40 మంది ఎమ్మెల్యేల తిరుగుబాటు..?

 
తమిళ రాజకీయాలు మళ్ళీ హీటెక్కాయి. సీఎం పళనీస్వామి బలపరీక్షకు సిద్ధమవుతున్న సమయంలో షాక్ తగిలింది. శనివారం బలపరీక్ష అనగా శుక్రవారం అనూహ్య పరిణామాలు చోటు చేసుకున్నాయి. ఏకంగా 40 మంది ఎమ్మెల్యేలు తిరుగుబాటు చేశారు. దీంతో శశికళ-పళనీస్వామి వర్గానికి దిమ్మ తిరిగింది. తిరుగుబాటు చేసిన ఎమ్మెల్యేలు పళనీస్వామి నాయకత్వం తమకు ఇష్టం లేదని చెప్పినట్లుగా రాజకీయ వర్గాల సమాచారం. దీంతో వారిని బుజ్జగించేందుకు డిప్యూటీ స్పీకర్ తంబిదురై విశ్వ ప్రయత్నాలు చేస్తున్నట్లుగా సమాచారం.

InCorpTaxAct
Suvidha

ముఖ్యంగా తిరుగుబాటు చేసిన ఎమ్మెల్యేలు శశికళపై ప్రజల్లో వ్యతిరేకతను చూసి భయపడుతున్నారని సమాచారం. వీరంతా పళనీ స్వామి ప్రమాణ స్వీకారం సందర్భంగా బయటకు వచ్చినప్పుడు ప్రజలు వీరిపై దుమ్మెత్తిపోశారు. వారి వాహనాలను అడ్డుకుని నానా బూతులు తిట్టారు. ఇక పన్నీరు వర్గం వ్యూహం ఫలించినట్లు అయింది. సోషల్ మీడియా వేదికగా ఎమ్మెల్యేలపై వారి వారి నియోజక వర్గాల్లో ప్రజలను రెచ్చగొట్టారు. దీంతో వారు తమ తమ ఎమ్మెల్యేలపై ఒత్తిడి తెస్తున్నారు. దీంతో పళనీ స్వామికి ఓటేస్తే రాజకీయంగా భూస్థాపితం అయిపోతామని భయపడుతున్నట్లుగా రాజకీయ వర్గాల్లో ముమ్మర ప్రచారం సాగుతోంది.

మరోవైపు రేపు బలపరీక్ష సందర్భంగా ఎమ్మెల్యేలు అందరూ తప్పనిసరిగా హాజరుకావాలని విప్ జారీ అయింది. తంబిదురై ఎమ్మెల్యేను బుజ్జగిస్తున్నట్లుగా సమాచారం. పళనీస్వామికి ఓటు వేయకపోతే సభ్యత్వం రద్దు అవుతుందని హెచ్చరించినట్లుగా తెలుస్తోంది. తాజాగా తిరుగుబాటుతో రేపటి బలపరీక్షలో పళనీస్వామి నెగ్గుతారా అన్నది ప్రశ్నార్ధకంగా మారింది.

InCorpTaxAct

If you like to publish news or your story on our website, please email to editor 'at' deccanabroad.com.


    Print       Email

You might also like...

Vanisri Birthday Special on SakshiTV : Aug 3rd 2:30 PM EDT

Read More →