Loading...
You are here:  Home  >  Daily News  >  Current Article

5 states elections.. Partywise Results..

By   /  March 11, 2017  /  Comments Off on 5 states elections.. Partywise Results..

    Print       Email

5 states elections 2017ఏ రాష్ట్రంలో ఏ పార్టీకి ఎన్ని స్థానాలు..!

యావత్ భారతాన్ని ఆకర్షించిన ఐదు రాష్ట్రాల ఎన్నికలు ముగిశాయి. యూపీ, ఉత్తరాఖండ్, పంజాబ్, మణిపూర్, గోవాలలో అసెంబ్లీ ఎన్నికల రిజల్ట్స్ వెలువడ్డాయి. అయితే కొద్దికాలంగా కొనసాగుతూ వస్తున్న ప్రాంతీయ పార్టీల హవాకు ఈ సారి గండిపడింది. అన్నిచోట్ల జాతీయ పార్టీలకే జనం పట్టం కట్టారు. ఓ సారి ఏ రాష్ట్రంలో ఏ పార్టీకి ఎన్ని సీట్లు వచ్చాయో చూద్దాం..

InCorpTaxAct
Suvidha

 

యూపీ ఎన్నికల్లో బీజేపీకి పట్టం కట్టిన ఓటర్లు..

యూపీ దేశంలోనే అతిపెద్ద రాష్ట్రం. ఇక్కడ నెగ్గిన పార్టీకి ఢిల్లీ పీఠం దగ్గర అవుతుందని అందరూ భావిస్తూ ఉంటారు. దీంతో ఈ ఎన్నికలను కాంగ్రెస్, బీజేపీ ప్రతిష్టాత్మకంగా తీసుకున్నాయి. ఇక రెండవసారి అధికారం కోసం ఎస్పీ అధినేత అఖిలేష్ యాదవ్ విశ్వ ప్రయత్నాలు చేశారు. అయితే జనం మాత్రం బీజేపీకి బాసటగా నిలిచారు. 403 స్థానాలు ఉన్న యూపీలో బీజేపీ రికార్డు స్థాయిలో విజయం సాధించింది. ఆ పార్టీ ఏకంగా 325 స్థానాలను కైవసం చేసుకుంది. ఎస్పీ-కాంగ్రెస్ కు 54 స్థానాలు.. బీఎస్పీకి 19 స్థానాలు దక్కాయి.

బీజేపీ-325
ఎస్పీ-కాంగ్రెస్ కూటమి -54
బీఎస్పీ-19
ఇతరులు – 5

ఉత్తరాఖండ్ లో బీజేపీ విజయం..

మోదీ హవా ఉత్తరాఖండ్ లోనూ కనిపించింది. ఇక్కడ కూడా కాంగ్రెస్ ను మట్టికరిపించింది. ఈ రాష్ట్రంలో మొత్తం 70 స్థానాలు ఉన్నాయి. బీజేపీ 56 స్థానాలను కైవసం చేసుకుంది. కాంగ్రెస్ 11 స్థానాలతో సరిపెట్టుకుంది. ముఖ్యమంత్రి హరీశ్ రావత్ పోటీ చేసిన రెండు స్థానాల్లో ఓటమి పాలయ్యారు.

బీజేపీ -56 ఆధిక్యం -1
కాంగ్రెస్ -11
ఇతరులు-2

గోవాలో హోరా హోరీ పోరు..

గోవాలో ప్రభుత్వ ఏర్పాటుకు కావాల్సిన సంఖ్యను బీజేపీ, కాంగ్రెస్ రెండూ సాధించలేకపోయాయి. ఈ రాష్ట్రంలో మొత్తం 40 స్థానాలు ఉన్నాయి. కాంగ్రెస్ కూటమి 19 స్థానాలు కైవసం చేసుకుంది. బీజేపీ 14 స్థానాలు సాధించింది. అలాగే ఎంజీపీ కూటమి 3 స్థానాలు సాధించింది. ఇతరులు 4 స్థానాలు దక్కించుకున్నారు.

కాంగ్రెస్-19
బీజేపీ-14
ఎంజీపీ-3
ఇతరులు-4

మణిపూర్ లోనూ మేజిక్ ఫిగర్ సాధించని బీజేపీ, కాంగ్రెస్..

మణిపూర్ లో కూడా బీజేపీ, కాంగ్రెస్ లు మేజిక్ ఫిగర్ సాధించలేకపోయాయి. ఈ రాష్ట్రంలో 60 స్థానాలు ఉన్నాయి. కాంగ్రెస్ 28 స్థానాలు కైవసం చేసుకుంది.బీజేపీ 21 సీట్లు సాధించి తర్వాతి స్థానంలో నిలిచింది. ఇతరులు 11 స్థానాల్లో గెలుపొందారు. ఇరోమ్ షర్మిలను జనం ఆదరించలేదు. దీంతో ఆమె రాజకీయాల నుంచి తప్పుకుంటున్నట్లుగా ప్రకటించారు.

కాంగ్రెస్-28
బీజేపీ-21
ఇతరులు-11

పంజాబ్ లో సత్తా చాటిన కాంగ్రెస్ ..

ఐదు రాష్టాల ఎన్నికల్లో కాంగ్రెస్ కేవలం పంజాబ్ లో మాత్రమే స్పష్టమై ఆధిక్యత సాధించింది. ఈ రాష్ట్రంలో మొత్తం 117 స్థానాలు ఉన్నాయి. కాంగ్రెస్ 77 స్థానాలు కైవసం చేసుకుంది. అకాలీదళ్, బీజేపీ కూటమి కేవలం 18 స్థానాలు దక్కించుకుంది. ఆప్ కి 20 స్థానాలు వచ్చాయి. దీంతో ఆ పార్టీకి సెకెండ్ ప్లేస్ దక్కింది.

కాంగ్రెస్ -77
ఆప్-20
అకాలీదళ్ – బీజేపీ – 18

InCorpTaxAct

If you like to publish news or your story on our website, please email to editor 'at' deccanabroad.com.


    Print       Email

You might also like...

Vanisri Birthday Special on SakshiTV : Aug 3rd 2:30 PM EDT

Read More →