Loading...
You are here:  Home  >  Daily News  >  Current Article

Police caught Anchor Pradeep in Drunk and Drive..

By   /  January 2, 2018  /  Comments Off on Police caught Anchor Pradeep in Drunk and Drive..

    Print       Email

మందేసి అడ్డంగా బుక్కయిన స్టార్ యాంకర్ ప్రదీప్

 

InCorpTaxAct
Suvidha

 

న్యూ ఇయర్ సందర్భంగా భాగ్యనగరంలో మందు బాబులు రెచ్చిపోయారు. అర్ధరాత్రి వరకు ఫుల్ గా తాగి ఎంజాయ్ చేశారు. అయితే పోలీసులు నిర్వహించిన డ్రంక్ అండ్ డ్రైవ్ లో 1200 అడ్డంగా బుక్కయ్యారు. వీరిలో ప్రముఖ యాంకర్, నటుడు ప్రదీప్ కూడా ఉన్నారు. జూబ్లీహిల్స్ లోని రోడ్ నంబర్ 45లో జరిగిన తనిఖీల్లో ఆయన దొరికిపోయారు. ఓ పబ్బులో మందు కొట్టి వచ్చిన ఆయన, మందు తాగితే డ్రైవర్లను చూసుకోవాలని ముందే హెచ్చరించిన పోలీసుల మాటలను పట్టించుకోలేదు.

స్కోడా కంపెనీకి చెందిన ‘టీఎస్ 07 ఈయూ 6666’ కారులో డ్రైవింగ్ చేస్తూ దొరికిపోయారు. జూబ్లీహిల్స్ లో తనిఖీలు నిర్వహిస్తున్న పోలీసులకు ప్రదీప్ కారు కనిపించింది. అనుమానాస్పదంగా ఉన్న వారికి మాత్రమే బ్రీత్ అనలైజర్ పరీక్షలు నిర్వహిస్తున్న పోలీసులకు ప్రదీప్ ముఖం చూడగానే మేటర్ క్లారిటీ వచ్చేసింది. ఏం పేరు అని పోలీసులు ప్రశ్నించగానే ‘ప్రదీప్’ అంటూ సమాధానం చెప్పారు. అంతే అక్కడే ఉన్న మీడియా కెమెరాలు ప్రదీప్ వైపుకు తిరిగాయి. ఇంతలో పోలీసులు బ్రీత్ అనలైజర్ ను ఉంచగా, 178 పాయింట్ల రీడింగ్ వచ్చింది. తాను దొరికిపోయానని అర్ధం చేసుకున్న ప్రదీప్ తన కారును పోలీసులకు అప్పగించి వేరే కారులో సైలెంట్ గా వెళ్లిపోయారు. ఆయన్ను కోర్టులో హాజరుపరుస్తామని పోలీసులు తెలిపారు.

InCorpTaxAct

If you like to publish news or your story on our website, please email to editor 'at' deccanabroad.com.


    Print       Email

You might also like...

Tribute to Ghantasala

Read More →