జూన్ 3న అ..ఆ?
అన్నీ ఉన్నా అల్లుడి నోట్లు శని అన్నట్లుగా నితిన్ సమంతలు జంటగా నటించిన అ..ఆ సినిమా అన్నీకంప్లీట్ చేసుకుని ఫస్ట్ కాపీ చేతిలో పట్టుకున్నా సరైన రిలీజ్ డేట్ దొరక్క ఇప్పటికీ ఆ సినిమా ల్యాబ్‌లోనే ఉండిపోవాల్సి వచ్చింది. మాటల మాంత్రికుడు త్రివిక్రమ్ శ్రీనివాస్ రూపందించిన ఈ చిత్రాన్ని మొదట మే 6న విడుదల చేద్దామని అనుకున్నా.. అప్పట్లో బ్రహ్మోత్సవంపై క్లారిటీ రాలేదు. ఆ తర్వాత మే 6ను సూర్య 24 ఖాయం చేసుకుంది. ఇప్పుడు మే 20న మహేష్ బాబు మూవీ బ్రహ్మోత్సవం విడుదల ఫైనల్ కావడంతో.. ఆ తర్వాత రెండు వారాలకు డేట్ ని ఫిక్స్ చేసుకున్నారు. జూన్ 3న అ..ఆ..ను విడుదల చేయాలని నిర్ణయించారు. నిజానికి ఈ డేట్ పై కూడా అనుమానాలు ఉన్నా.. సౌతిండియా సూపర్ స్టార్ రజినీకాంత్ మూవీ కబాలి జూలై 1కి పోస్ట్ పోన్ కావడంతో.. అ..ఆ..ను జూన్ 3కు ఫిక్స్ చేసుకున్నారు. అ..ఆ.. విడుదలపై త్రివిక్రమ్ కానీ యూనిట్ కానీ ఇంకా అధికారికంగా ప్రకటించలేదు. ఇప్పుడు టాలీవుడ్ అంతా బ్రహ్మోత్సవం హంగామా నడుస్తుండడంతో.. అది రిలీజ్ అయిన 4-5 రోజుల తర్వాత అ..ఆ.. రిలీజ్ పై అనౌన్స్ మెంట్ ఇవ్వాలని నిర్ణయించాడట త్రివిక్రమ్. ఏదేమైనా మరికొద్ది రోజులు ఆగితేకానీ క్లారీటీ వచ్చే అవకాశం కనిపించడం లేదు.
If you like to publish news or your story on our website, please email to editor 'at' deccanabroad.com.