
న్యూయార్క్ వాల్ మార్ట్ స్టోర్ లో కాల్పులకు తెగబడిన దుండగుడు..
న్యూయార్క్ లోని ఘోరం జరిగిన విషయం తెలిసిందే. సైకిల్ ట్రాక్ పైకి ఓ ట్రక్కుతో దూసుకొచ్చి జనాలను తొక్కించిన ఘటన అందరికి తెలిసిందే. ఈ ఘటనను మరువక ముందే కొలరాడోలోని వాల్ మార్ట్ స్టోర్ లో ఓ వ్యక్తి తుపాకితో హల్ చల్ చేశాడు. దుండగుడు జరిపిన కాల్పుల్లో ఇద్దరు మృత్యువాత పడ్డారు. ఓ మహిళకు తీవ్ర గాయాలు అయ్యాయి. డెన్వర్ శివార్లలోని వాల్ మార్ట్ స్టోర్ లో ఈ ఘటన చోటు చేసుకుంది. సమాచారం అందుకున్న పోలీసులు గన్ ఫైర్ కు చేపట్టారు.
ఈ విషయాన్ని థ్రాంటన్ పోలీస్ విభాగం ట్విట్టర్ లో పేర్కొంది. అయితే ఘటనకు సంబంధించి మరింత సమాచారం తెలియాల్సి ఉంది. గాయపడిన మహిళను ఆస్పత్రికి తరలించారు.ఈ విషయాన్ని ఓ అధికారి వెల్లడించారు. అసలు కాల్పులకు కారణం ఎవరు? ఎందుకు కాల్పులు జరిపాడు? అన్న విషయాలు తెలియాల్సి ఉంది. అతను యాక్టివ్ షూటర్ కాదని, సాధ్యమైనంత త్వరలోనే పూర్తి సమాచారాన్ని వెల్లడిస్తామని పోలీసులు చెప్పారు. కాల్పులు జరిపింది ఉగ్రవాదా.. ? కాదా అన్న కోణంలో పోలీసులు విచారణ చేపట్టారు.
If you like to publish news or your story on our website, please email to editor 'at' deccanabroad.com.