అభినేతి చిత్రాన్ని అందుకే ఒప్పుకున్నా
“నాకు 15 ఏళ్లు ఉన్నప్పుడు శ్రీ కథ చెప్పడానికి కోనగారు మా ఇంటికి వచ్చారు. నా ఇన్నేళ్ల కెరీర్‌కి ఆయనే సాక్షిం. బాహుబలి తర్వాత నా నుంచి వైవిధ్యమైన చిత్రాన్ని ఆశించే ప్రేక్షకులకు `అభినేత్రి`తప్పక నచ్చుతుంది“ అన్నారు మిల్కీ బ్యూటీ తమ్మన్నా. ప్రభుదేవా సరసన ఆమె నటించిన `అభినేత్రి`ఫస్ట్‌లుక్ టీజర్‌ను హైదరాబాద్‌లో వి.వి.వినాయక్ విడుదల చేశారు. డ్యాన్సింగ్ టీజర్‌ను హిందీ వెర్షన్ నిర్మాత నటుడు సోనూసూద్ ఆవిష్కరించారు. ఈ సందర్భంగా తమన్నా మాట్లాడుతూ “ నా దృష్టిలో ప్రభుదేవా కింగ్ ఆఫ్ డ్యాన్స్ కాదు.. గాడ్ ఆఫ్ డ్యాన్స్. అభినేత్రి చిత్రాన్ని ఒప్పుకుంటే ఆయనతో సన్నిహితంగా మాట్లాడవచ్చని అంగీకరించా“ అన్నారు. అభినేత్రి హీరోయిన్ ఓరియంటెడ్ చిత్రమో.. హర్రర్ హిత్రమో కాదని, దర్శకుడు విజయ్ చాలా మంచి స్క్రిప్ట్ చేశారన్నారు.
ఎ.ఎల్.విజయ్ దర్శకత్వంలో కోన ఫిల్మ్ కార్పొరేషన్, బ్లూ సర్కిల్ కార్పొరేషన్, బీఎల్ఎన్ సినిమా,ఎంవీవీ సినిమాస్ సంయుక్తంగా నిర్మిస్తోన్న ఈ చిత్రం పెద్ద హిట్ కావాలని కోరుకుంటున్నామన్నారు. ప్రభుత్వ డ్యాన్స్‌ను మరిచిపోలేమని, ఆయన హైదరాబాద్‌లో కూడా ఒక డ్యాన్సింగ్ స్కూల్‌ను పెట్టాలని వినాయక్ కోరారు.
If you like to publish news or your story on our website, please email to editor 'at' deccanabroad.com.