Loading...
You are here:  Home  >  Politics  >  Andhra Politics  >  Current Article

Abolish poverty, KCR’s primary goal in Telangana

By   /  June 3, 2016  /  Comments Off on Abolish poverty, KCR’s primary goal in Telangana

    Print       Email

parade groundsపేద‌రిక నిర్మూల‌నే ల‌క్ష్యం

 

InCorpTaxAct
Suvidha

 

 

బంగారు తెలంగాణ సాధించే వ‌ర‌కు క‌లిసిక‌ట్టుగా ప‌నిచేద్దాం

కోటి ఎక‌రాల‌కు నీరు అందిద్దాం

దసరా నాటికి రాష్ట్రంలో కొత్త జిల్లాలు

తెలంగాణ రాష్ట్ర అవతరణ దినోత్సవంలో ముఖ్యమంత్రి కె. చంద్రశేఖర్‌రావు

తెలంగాణ రాష్ట్రంలో ఉన్న పేద‌ల‌ను ఆదుకునేందుకు టీఆర్ఎస్ ప్ర‌భుత్వం ఎప్పుడూ ముందుంటుంద‌ని, రాష్ట్రంలో పేదరిక నిర్మూల‌నే ల‌క్ష్యంగా ప‌నిచేస్తున్నామ‌ని తెలంగాణ ముఖ్య‌మంత్రి కె.చంద్ర‌శేఖ‌ర్ రావు అన్నారు.  రాష్ట్రం ఇప్పుడిప్పుడే బాలారిష్టాల‌ను అధిగ‌మిస్తూ అభివృద్ధి వైపు న‌డుస్తోంద‌న్నారు.  తెలంగాణ రాష్ట్ర అవతరణ ద్వితీయ వార్షికోత్సవాల సందర్భంగా గురువారం సికింద్రాబాద్ పరేడ్ గ్రౌండ్స్‌లో జరిగిన ప్రధాన కార్యక్రమంతోపాటు హెచ్‌ఐసీసీలో వివిధ రంగాలలో నిష్ణాతులతో నిర్వహించి న విశిష్ట సభలోనూ ముఖ్యమంత్రి ప్రసంగించారు. ఎవ‌రు స‌హ‌క‌రించినా.. స‌హ‌క‌రించ‌క‌పోయినా కృష్ణా, గోదావ‌రి న‌దుల్లో చుక్క‌నీరు కూడా వ‌ద‌ల‌కుండా తెలంగాణ పొలాల‌ను త‌డుపుతామ‌న్నారు. కోటి ఎక‌రాల‌కు నీరు అందించి తీరుతామ‌ని, 2018 నాటికి కాళేశ్వరం, పాలమూరు, డిండి, సీతారామ ప్రాజెక్టులు పూర్తిచేసి సాగునీరు అందిస్తామన్నారు. 2020 నాటికి రాష్ట్ర బడ్జెట్ 2 లక్షల కోట్లకు, 2024 నాటికి రూ. 5 లక్షల కోట్లకు చేరుతుందని సీఎం ఆశాభావం వ్య‌క్తం చేశారు. రాష్ట్రంలో కరెంటు కోతలు లేవని, 2018కల్లా మంచినీటి కొరత కూడా ఉండబోదని చెప్పారు. త్వరలోనే 15 లక్షల జనాభాకు ఒక జిల్లాను ఏర్పాటు చేస్తామని చెప్పారు. విద్యుత్ రంగంలో ప్రైవేట్ పెట్టుబడులను అనుమతించబోమని, ఆర్టీసీని కూడా ఎట్టిపరిస్థితుల్లోనూ ప్రైవేటు వారి చేతిలో పెట్టబోమని చెప్పారు. గత రెండేండ్లలో రాజకీయ అవినీతిని నిర్మూలించామని, కిందిస్థాయి అవినీతిని సాంకేతిక పరిజ్ఞానం వినియోగించి అరికడుతామని పేర్కొన్నారు.

సమైక్య రాష్ట్రంలో తెలంగాణ ప్రజలు కనీస అవసరాల కోసం కూడా కొట్టుమిట్టాడాల్సిన దుస్థితి సంభ‌వించింద‌ని, ఈ పరిస్థితిని రూపుమాపేందుకు ప్రభుత్వం సంక్షేమ రంగానికి ప్రాధాన్యం ఇస్తోంద‌న్నారు. ఆసరా, వృద్ధాప్య, వితంతువులు, వికలాం గుల పింఛ న్లు అందిస్తూ ఆదుకుంటోంద‌ని కేసీఆర్ పేర్కొన్నారు.  పేదింటి ఆడపిల్ల పెండ్లి భారాన్ని పంచుకోవాలని కల్యాణలక్ష్మి, షాదీముబారక్ కార్యక్రమాల్ని ప్రవేశపెట్టిందని వివ‌రించారు.  తెలంగాణ అవతరణ దినోత్సవం సందర్భంగా రాష్ట్రవ్యాప్తంగా 598 మందికి ఉద్యోగ నియామక పత్రాలను అందిస్తున్నామ‌న్నారు. టీఎస్-ఐపాస్ విధానానికి ప్రపంచవ్యాప్తంగా పెద్ద పెద్ద సంస్థల నుంచి విశేష స్పందన  ల‌భిస్తోంద‌ని, ఇప్పటికే 1798 పరిశ్రమలు రూ.24,698 కోట్ల పెట్టుబడులు రాష్ట్రానికి వ‌చ్చిన‌ట్లు చెప్పారు.  టీ-హబ్ ఇతర రాష్ర్టాలకు మార్గదర్శకంగా నిలిచింద‌న్నారు.  ప్రతి అసెంబ్లీ నియోజకవర్గంలో ఏడాదికి 40 లక్షల చొప్పున రాష్ట్రవ్యాప్తంగా 40 కోట్ల మొక్కలు నాటాలని, హైదరాబాద్ నగరంలో మరో 10 కోట్ల మొక్కలు నాటాలని లక్ష్యంగా పెట్టుకున్న‌ట్లు తెలిపారు. తాము ఏ ప‌ని చేప‌ట్టినా అది తెలంగాణ అభివృద్ధి కోస‌మేన‌ని ముఖ్య‌మంత్రి కేసీఆర్ స్ప‌ష్టం చేశారు.

InCorpTaxAct

If you like to publish news or your story on our website, please email to editor 'at' deccanabroad.com.


    Print       Email

You might also like...

Vanisri Birthday Special on SakshiTV : Aug 3rd 2:30 PM EDT

Read More →