కొనసాగుతున్న ఢిల్లీ జేఎన్ యూ వివాదం..
ఢిల్లీ జేఎన్‌యూ వివాదం ఇంకా కొనసాగుతూనే ఉంది. ఈ వివాదంలో దేశద్రోహం కేసులో నిందితులుగా ఉన్న 5 గురు విద్యార్థులు గత కొన్ని రోజులుగా కనిపించడం లేదు. అయితే వీళ్ళంతా ఆదివారం రాత్రి వర్సిటీ ప్రాంగణంలో ఉన్నారు. దీంతో పోలీసులు మరింత అప్రమత్తమయ్యారు. నిందితులు ఉమర్ ఖలీద్, అనిర్బన్, అశుతోష్, రమా నాగ, అనంత్ ప్రకాశ్‌ల పేర్లు దేశద్రోహం కేసులో నమోదు చేసిన ఎఫ్ఐఆర్లో ఉన్నాయి. అయితే వీరిని పోలీసులు ఇవాళ అదుపులోకి తీసుకునే అవకాశం ఉంది. విద్యార్ధులు తమంతట తాముగా లొంగిపోతారని భావిస్తున్నట్లు పోలీసులు చెబుతున్నారు. ఇక విద్యార్ధులు కూడా వారంతట వారే లొంగిపోవాలని భావిస్తున్నట్లు సమాచారం. వీరికి మద్దతు తెలియజేస్తూ ఆదివారం జేఎన్ యూ విద్యార్దులు, ప్రొపెసర్లు వర్సిటీ ప్రాంగణంలో ఆందోళన చేపట్టినట్లు సమాచారం.
ఇక జేఎన్‌యూ అధికారులు సమావేశమై ఈ అంశంపై చర్చించనున్నారు.ఇందులో భాగంగా విద్యార్థులను లొంగిపోవాలని వీసీకి.. యూనివర్సిటీ కమిటీ సూచించే అవకాశం ఉంది. జేఎన్‌యూలో పార్లమెంటుపై దాడి కేసులో అఫ్జల్‌గురుకు మద్దతుగా ఇటీవల నినాదాలు చేసిన సంగతి తెలిసిందే. దీంతో దేశద్రోహం కేసులో జేఎన్‌యూ విద్యార్థి సంఘం నాయకుడు కన్నయ్య కుమార్‌ను పోలీసులు అరెస్టు చేసిన విషయం తెలిసిందే.
If you like to publish news or your story on our website, please email to editor 'at' deccanabroad.com.