Loading...
You are here:  Home  >  Politics  >  Andhra Politics  >  Current Article

Activist Trupti Desai stopped from entering Shani Shingnapur Temple despite HC order, detained

By   /  April 2, 2016  /  Comments Off on Activist Trupti Desai stopped from entering Shani Shingnapur Temple despite HC order, detained

    Print       Email

trupti desai - sani singanopore

శని శింగణాపూర్ లో తీవ్ర ఉద్రిక్తత..

InCorpTaxAct
Suvidha

 

 

మహారాష్ట్ర శని శింగణాపూర్‌ శని దేవాలయంలోకి తృప్తి దేశాయ్ నేతృత్వంలో పలువురు మహిళలు ప్రవేశించేందుకు తీవ్రంగా యత్నించారు. దేవాలయంలో ప్రవేశానికి పురుషులతో సమానంగా మహిళలకు కూడా హక్కులు ఉన్నట్లు శుక్రవారం బోంబే హైకోర్టు తీర్పు ఇచ్చింది. ఈ నేపథ్యంలో ఓ మాజీ ఎమ్మెల్యే కూడా మహిళలకు మద్దతుగా శని దేవాలయం గర్భగుడిలో ప్రవేశించేందుకు యత్నించారు. ఈ నేపథ్యంలో పోలీసులకు, మహిళలకు మధ్య తోపులాట చోటు చేసుకుని ఉద్రిక్తత ఏర్పడింది. దేవాలయ ట్రస్టు బోర్డు హైకోర్టు ఆదేశాలను అమలు చేస్తుందా..? లేదా..? అన్న విషయం ప్రస్తుతం హాట్ టాపిక్ అయింది.అయితే ట్రస్ట్ బోర్డ్ మాత్రం హైకోర్టు ఆదేశాలకు తమకు అందలేదని స్పష్టం చేసింది.

మహారాష్ట్ర ప్రభుత్వానికి హైకోర్టు ఇచ్చిన ఆదేశాల్లో మహిళల హక్కులను కాపాడాలని తెలిపింది. దేవాలయంలో మహిళల ప్రవేశంపై తమకు అభ్యంతరాలు లేవని మహారాష్ట్ర సర్కారు కూడా స్పష్టం చేసింది. హైకోర్టు తీర్పు లింగ వివక్షకు వ్యతిరేకంగా సాధించిన విజయమని భూమాత బ్రిగేడ్ నేత తృప్తి దేశాయ్ అన్నారు.

మహరాష్ట్ర శనిసింగనాపూర్‌లోని శనీశ్వరాలయం దగ్గర తీవ్ర ఉద్రిక్తత నెలకొంది. మహిళలకు ఆలయ ప్రవేశాల్లో సమాన హక్కు ఉంటుందని.. మహిళలను ఎవ్వరూ అడ్డుకోరాదని బాంబే హైకోర్టు తీర్పు ఇచ్చిన నేపథ్యంలో తృప్తి దేశాయ్‌ నేతృత్వంలోని భూమాత బ్రిగేడ్‌ మహిళా సంఘం ఆలయం దగ్గరకు భారీ ర్యాలీగా వెళ్ళారు. ఆలయంలోకి ప్రవేశించేందుకు యత్నించారు. అయితే మహిళలను పోలీసులు, స్థానికులు అడ్డుకున్నారు. దీంతో ఆ ప్రాంతంలో తీవ్ర ఉద్రిక్త పరిస్థితులు ఏర్పడ్డాయి.

InCorpTaxAct

If you like to publish news or your story on our website, please email to editor 'at' deccanabroad.com.


    Print       Email

You might also like...

Vanisri Birthday Special on SakshiTV : Aug 3rd 2:30 PM EDT

Read More →