Loading...
You are here:  Home  >  Featured News  >  Current Article

Actor Dhanraj in 13 characters..

By   /  February 19, 2016  /  Comments Off on Actor Dhanraj in 13 characters..

    Print       Email

pani leni puli raju

ధన్ రాజ్ 13 పాత్రల్లో నటిస్తున్న ‘పనిలేని పులిరాజు’
ధన్ రాజ్ 13 పాత్రల్లో నటిస్తున్న మూవీ ‘పనిలేని పులిరాజు’. ఈ చిత్రానికి డైరెక్టర్ చాచా. పాలేపు మీడియా బ్యానర్ పై పి.వి. నాగేష్ కుమార్ ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు. ప్రస్తుతం ఈ చిత్రం సెన్సార్ కార్యక్రమాలు జరుపుకుంటోంది. ఈ సినిమా గురించి నిర్మాత పి.వి. నాగేష్ కుమార్ మాట్లాడారు. ధన్ రాజ్ సోలో హీరోగా నటిస్తున్న తొలి చిత్రంమని.. పూర్తిగా హస్యంతో కూడిన సినిమా అని తెలిపారు. తమ చిత్రం ఖచ్చితంగా ప్రేక్షకులను ఆకట్టుకుంటుందని ధీమా వ్యక్తం చేశారు. ప్రాచీ సిన్హా తో పాటు మరో నలుగురు హీరోయిన్లు నటిస్తున్నారని చెప్పారు. రఘుబాబు, ధన్ రాజ్ చేసిన కామెడీ విశేషంగా ఆకట్టుకుంటుందన్నారు.

InCorpTaxAct
Suvidha

చిత్ర సమర్పకురాలు పి. లక్ష్మి మాట్లాడుతూ .. ప్రస్తుతం సెన్సార్ జరుపుకుంటున్న ఈ చిత్రాన్ని వచ్చే నెల రెండో వారంలో విడుదల చేయడానికి ప్రయత్నాలు చేస్తున్నామన్నారు. సహ నిర్మాత రవి కె. పున్నం మాట్లాడుతూ.. వినోదాత్మకంగా సాగే ఈ సినిమాలో మొత్తం నాలుగు పాటలు ఉన్నాయన్నారు. త్వరలోనే ఆడియోను రిలీజ్ చేస్తామన్నారు.మూవీలో ధన్ రాజ్ 13 పాత్రలు పోషిస్తున్నారని.. అన్ని పాత్రలు నవ్విస్తాయన్నారు. ఈ సినిమాని మార్చి రెండోవారంలో విడుదల చేయడానికి సన్నాహాలు చేస్తున్నామన్నారు. పులిరాజుల వంశంపై తెరకెక్కించిన తమ సినిమాలో హస్యంతో పాటు సందేశం కూడా ఉంటుందని దర్శకుడు చాచా చెప్పారు.

శ్వేతా వర్మ, ఇషా, హరిణి, సీమ, సరితా కోట, కొండవలస, కోటేశ్వరరావు, సుబ్బారావ్ , డి.వి, శక్తిమాన్, అప్పారావ్, వెంకీ నటించిన ఈ చిత్రానికి కెమెరా: ఆనంద్ మరుకుర్తి, సంగీతం: వి.వి. పాటలు: బాలాజీ, కరుణాకర్, లక్ష్మీ నరసింహా, చాచా, డాన్స్: నిక్సన్, కళాధర్, రామారావు, మూల కథ – సహ నిర్మాత: రవి.కె.పున్నం, నిర్మాత: పి.వి.నాగేష్ కుమార్, స్రీన్ ప్లే, దర్శకత్వం: చాచా

InCorpTaxAct

If you like to publish news or your story on our website, please email to editor 'at' deccanabroad.com.


    Print       Email

You might also like...

Vanisri Birthday Special on SakshiTV : Aug 3rd 2:30 PM EDT

Read More →