Loading...
You are here:  Home  >  Daily News  >  Current Article

Actor Uppendra Goodbye to the KPJP

By   /  March 7, 2018  /  Comments Off on Actor Uppendra Goodbye to the KPJP

    Print       Email

కేపీజేపీకి ఉపేంద్ర గుడ్‌బై

InCorpTaxAct
Suvidha

 

 

 

 

* త్వ‌ర‌లో కొత్త‌పార్టీకి స‌న్నాహాలు
* క‌ర్నాట‌క‌లోని అన్ని స్థానాల్లో పోటీ
డెక్క‌న్ అబ్రాడ్‌: ఈ మ‌ధ్య సినిమా హీరోలు పార్టీలు పెట్ట‌డం ఎక్కువైంది. హీరోలు పెట్టే ఆ పార్టీలు ఏవీ అధికారంలోకి రాక‌పోగా.. క‌నీసం పోటీ చేయ‌ని పార్టీలు కూడా ఉన్నాయి. అంతేకాదు పార్టీలు ప్ర‌క‌టించిన కొన్ని నెల‌ల‌కే ఆ పార్టీల‌కు గుడ్‌బై చెప్పే హీరోలు ఉన్నారు. ఆ కోవ‌కే చెందుతారు హీరో ఉపేంద్ర‌. మెగాస్టార్ చిరంజీవి స్థాపించిన ప్ర‌జారాజ్యం పార్టీ కాంగ్రెస్‌లో విలీనం చేయ‌గా.. ఆయ‌న త‌మ్ముడు ప‌వ‌న్ క‌ల్యాణ్ స్థాపించిన జ‌న‌సేన పార్టీ ఎన్నిక‌ల్లో పోటీ చేయ‌కుండా టీడీపీ, బీజేపీకి స‌పోర్ట్ చేశారు. తాజాగా క‌ర్ణాట‌క హీరో ఉపేంద్ర కేపీజేపీకి గుడ్‌బై చెప్పేశారు. వివ‌రాల్లోకి వెళ్లితే..కొద్ది రోజుల క్రితం కర్ణాటక ప్రజ్ఞావంతర జనతా పార్టీ (కర్ణాటక ప్రతిభావంతుల జనతా పార్టీ)ని స్థాపించిన సంగతి తెలిసిందే. కర్ణాటకలో రాజకీయ నాయకులు ఇచ్చే డబ్బులు తీసుకొని….ఓటు మాత్రం వారికి వేయొద్దని ఉపేంద్ర…ప్రజలకు ఇచ్చిన పిలుపు వివాదాస్పదమైన సంగతి తెలిసిందే. తన పార్టీకి సంబంధించిన కార్యక్రమాలు – తన రాజకీయ పర్యటనల వివరాలను తెలియజేస్తూ ‘కేపీజేపీఉప్పి` పేరుతో ఓ వెబ్ సైట్ ను కూడా ఉపేంద్ర ప్రారంభించారు. 2018లో జరగబోతోన్న ఎన్నికల్లో కర్ణాటకలోని 224 శాసన సభ స్థానాల్లో తమ పార్టీ అభ్యర్థులు పోటీ చేస్తారని ప్రకటించారు.
పోటీ చేసేందుకు ఆసక్తి ఉన్న వారు ఆ వెబ్ సైట్ లో వివరాలు నమోదు చేయాలని కోరారు. అయితే అనూహ్యంగా ఉపేంద్ర …..కేపీజేపీకి రాజీనామా చేస్తున్నట్లు ప్రకటించి షాక్ ఇచ్చారు. తనతో పాటు తన మద్దతుదారులు – నాయకులు రాజీనామా చేస్తున్నామని – ఇక నుంచి ఆ పార్టీతో తమకు ఎలాంటి సంబంధం లేదని ప్రకటించడం రాష్ట్రమంతటా చర్చనీయాంశమైంది. కేపీజేపీ కూడా మిగిలిన రాజకీయ పార్టీల్లా కాకూడదని – అంతర్గత కుమ్ములాటలు ఇష్టం లేకనే తాను తప్పుకుంటున్నానని ఉపేంద్ర అన్నారు. తాను రాజకీయాల్లో పిల్లాడినని – త్వరలో తన భవిష్యత్తును అభిమానులే నిర్ణయిస్తారని చెప్పారు. తాను బీజేపీలో చేరబోతున్నానని వస్తున్న వార్తల్లో నిజం లేదన్నారు. కేపీజేపీ వ్యవస్థాపకుడు మహేష్ గౌడతో వచ్చిన విభేదాల కారణంగానే ఉపేంద్ర ఆ పార్టీకి రాజీనామా చేశారు.
తన సిద్ధాంతాలు నచ్చి తనను ఆ పార్టీ అధ్యక్షుడిగా మహేష్ నియమించారని అందుకు తగ్గట్లే రాబోయే ఎన్నికల్లో అభ్యర్థులను సిద్ధం చేశామని ఇప్పుడు వేరే అభ్యర్థులను బరిలో దింపాలని మహేష్ డిమాండ్ చేస్తున్నారని ఉపేంద్ర అన్నారు. తాను పార్టీ ఫండ్ వసూలు చెయ్యనని ముందే చెప్పానని – ఇపుడు వసూలు చేయాలని మహేష్ కోరారని – తనకు ఇష్టంలేకే బయటకు వచ్చానని అన్నారు. ఏపార్టీలో చేరే ఉద్దేశం తనకు లేదని తన సిద్దాంతాలకు అనుగుణంగా సొంత పార్టీని స్థాపిస్తానని అన్నారు. తమ కొత్త పార్టీ తరఫున 200 మంది అభ్యర్థులు పోటీ చెయ్యడానికి సిద్ధంగా ఉన్నారన్నారు.

InCorpTaxAct

If you like to publish news or your story on our website, please email to editor 'at' deccanabroad.com.


    Print       Email

You might also like...

Vanisri Birthday Special on SakshiTV : Aug 3rd 2:30 PM EDT

Read More →