ప్రముఖ సినీ నటి కిడ్నాప్..!
ప్రముఖ సినీ నటి భావన కిడ్నాప్ కు గురయ్యారు. పోలీసుల వెల్లడించిన వివరాల ప్రకారం భావన కేరళలోని ఎర్నాకుళంలోని ఓ సినిమా షూటింగ్ కి వెళ్ళారు. చిత్ర షూటింగ్ పూర్తి చేసుకుని ఇంటికి వెళ్తూంగా కొందరు దుండగులు ఆమెను అడ్డుకున్నారు. అతాని ఏరియాలో ఆమె కారును అడ్డుకుని కారును హై జాక్ చేశారు. తర్వాత కారును తమకు నచ్చిన దారిలో పోనిచ్చారు. దాదాపుగా 25 కిలో మీటర్ల మేర రన్నింగ్ లో ఉన్న కారులో ఆమెపై లైంగిక వేధింపులకు పాల్పడ్డారు. తర్వాత పలరివత్తమ్ ఏరియాలో కారును ఆపి ఉడాయించారు.
ఈ ఘటన తర్వాత భావన పోలీసులకు కంప్లైంట్ చేశారు. కారును అడ్డగించిన వారిలో ఒకరు తన దగ్గర పనిచేసి డ్రైవర్ మార్టిన్ గా భావన గుర్తు పట్టారు. మరో వ్యక్తి కూడా ఆమె దగ్గర పనిచేసిన సునీల్ గా పోలీసులు గుర్తించారు. ఇక మార్టిన్ ను పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. ఇక కారులో ఉండగా తన చిత్రాలను చిత్రీకరించారని భావన పోలీసులకు తెలియజేశారు. దీంతో పోలీసులు వారిపై కిడ్నాప్ కేసు పెట్టారు. అలాగే వేధింపుల కేసు కూడా నమోదు చేశారు. భావన మలయాళంలో మంచి నటిగా పేరు తెచ్చుకున్నారు. ఒంటరి, మహాత్మా వంటి చిత్రాలలో తన నటనతో ప్రేక్షకులను ఆకట్టుకున్నారు.
If you like to publish news or your story on our website, please email to editor 'at' deccanabroad.com.