Loading...
You are here:  Home  >  Featured News  >  Current Article

Actress Sridevi is booked for the mother character..

By   /  March 4, 2016  /  Comments Off on Actress Sridevi is booked for the mother character..

    Print       Email

sridevi 1

మళ్లీ మదర్ గా శ్రీదేవి..

InCorpTaxAct
Suvidha

 

అతిలోక సుందరి అనగానే శ్రీదేవి అని అందరూ ఇట్టే చెబుతారు. అయితే ఈ అందాల తార మళ్ళీ అమ్మ కాబోతోంది. రియల్ లైఫ్ లో కాదండోయ్.. రీల్ లైఫ్ లో..! సినిమాల్లోకి రీఎంట్రీ ఇచ్చిన తర్వాత వరుసగా మూడోసారి కూడా అమ్మ క్యారెక్టర్ లో శ్రీదేవి కనిపించనున్నారు. ఇంగ్లీష్ వింగ్లీష్ మూవీ ద్వారా రీ ఎంట్రీ బాగానే జరిగింది. తర్వాత వచ్చిన పులి మాత్రం కాస్త నిరాశ పరచింది. అందుకే ఈసారి ఆచితూచి అడుగులేస్తున్నారు.

 

ప్రస్తుతం ‘మామ్’ అనే మూవీకి శ్రీదేవి సైన్ చేశారు. రవి ఉద్యవర్ డైరెక్షన్ లో తెరకెక్కనున్న ఈ సినిమా స్క్రిప్ట్ పై చాలానే అనుమానాలున్నాయి. ఇప్పటి వరకూ ఈ మూవీలో లీడ్ రోల్ అయిన మదర్ పాత్ర కోసం చాలామందిని అడిగారు. అయితే ఎవరూ ఒప్పుకోలేదట. అయితే శ్రీదేవికి రవి చెప్పిన కథ నచ్చడంతో వెంటనే ఒకే చెప్పారని సమాచారం. ది లంచ్ బాక్స్ .. బద్లాపూర్ చిత్రాల్లో నటించిన నవాజుద్దీన్ సిద్ధిఖీ.. ‘మామ్’లో ఓ కీలక పాత్రలో కనిపించనున్నారు. ఇక.. ‘మామ్’ స్టోరీ శ్రీదేవి ఫ్యామిలీకి చాలాబాగా నచ్చిందట. అందుకే ఈ సినిమాని స్వయంగా బోనీకపూర్ నిర్మించనున్నారట. తల్లి పాత్రలో కనిపించేందుకు శ్రీదేవి కూడా ఎలాంటి అభ్యంతరాలు చెప్పలేదు. రియల్ లైఫ్ లో ఇద్దరు టీనేజర్లకు తల్లి అయిన శ్రీదేవి.. ఇలా వరుసగా తన మూడో సినిమాలో అమ్మగా నటిస్తోంది.

InCorpTaxAct

If you like to publish news or your story on our website, please email to editor 'at' deccanabroad.com.


    Print       Email

You might also like...

Vanisri Birthday Special on SakshiTV : Aug 3rd 2:30 PM EDT

Read More →