వైసీపీకి మరో ఎమ్మెల్సీ గుడ్ బై?
వైయస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నుంచి ఇక వలసలు ఆగిపోయాయనుకుంటున్నతరుణంలో ఆ పార్టీకి చెందిన మరో ఎమ్మెల్సీ పార్టీని వీడనున్నట్లు పుకార్లు షికార్లు చేస్తున్నాయి. ఎందుకు ఆ ఎమ్మెల్సీ పార్టీ మారేందుకు సిద్ధపడుతున్నాడు? కారణాలు ఏమైఉంటాయి? అనే విరాల్లోకి వెళ్లితే… తూర్పు గోదావరి జిల్లా రాజమహేంద్రవరానికి చెందిన వైసీపీ ఎమ్మెల్సీ ఆదిరెడ్డి అప్పారావు తెలుగుదేశం పార్టీలో చేరేందుకు రంగం సిద్ధం చేసుకుంటున్నట్లు తెలిసింది. స్థానికంగా బలమైన సామాజిక వర్గానికి చెందిన ఆదిరెడ్డి దివంగత నేత కింజరాపు ఎర్రన్నాయుడుకు స్వయానా వియ్యంకుడు. తాజాగా జరిగిన వైసీపీ జయంతి కార్యక్రమాలకు కూడా ఆదిరెడ్డి వర్గం దూరంగా ఉండటంతో ఆ పుకార్లకు బలం చేకూరుతోంది. మొదటి నుండి టీడీపీకి చెందిన ఆదిరెడ్డి అప్పారావు సతీమణి వీరరాఘవమ్మ గతంలో రాజమహేంద్రవరం నగర పాలక సంఘ మేయర్గా పనిచేశారు. టీడీపీలో ఇమడలేని పరిస్థితుల్లో వైసీపీలో చేరి ఎమ్మెల్సీ అయ్యారు.
అయితే ప్రస్తుతం వైసీపీలో రాజమహేంద్రవరం అసెంబ్లీ నియోజకవర్గ ఇన్ఛార్జి బాధ్యతలు తన కుమారుడు ఆదిరెడ్డి వాసుకు ఇవ్వాలని అప్పారావు వైసీపీ అధినేత వైయస్ జగన్ ను కోరగా ఆయన దాన్ని పెద్దగా పట్టించుకోలేదట. జక్కంపూడి రామ్మోహన్రావు కుటుంబానికి పెద్ద పీఠ వేస్తూ మాజీ ఎమ్మెల్యే రౌతు సూర్యప్రకాశరావుకు ఇన్ఛార్జి బాధ్యతలు ఇచ్చారట. ఇది అప్పారావుకు నచ్చకనే పార్టీ వీడేందుకు సిద్ధమవుతున్నట్లు సమాచారం. ఇప్పటికే ఆదిరెడ్డి ఇటీవల టీడీపీలోకి వెళ్లిన జగ్గంపేట ఎమ్మెల్యే జ్యోతుల నెహ్రూతో చర్చించినట్టు సమాచారం. ఈ మేరకు గత రాత్రే అంతర్గత సమావేశం నిర్వహించుకుని తనతోపాటు టిడిపిలోకి వచ్చే నగరపాలక సంస్థ కార్పొరేటర్లను కూడా సిద్ధం చేసుకున్నట్లు సమాచారం. ఏదేమైనా వైసీపీ నుంచి పార్టీ ఫిరాయింపులు ఇప్పట్లే ఆగేటట్లు లేవనేది స్పష్టమవుతోంది.
If you like to publish news or your story on our website, please email to editor 'at' deccanabroad.com.