మన మంత్రులు నేరస్థులా?
ఢిల్లీ కేంద్రంగా ఉన్న ఏడీఆర్ (అసోసియేషన్ ఫర్ డెమొకట్రిక్ రిఫామ్స్) సంస్థ విడుదల చేసిన సర్వే రెండు తెలుగు రాష్ట్రాల్లో తీవ్ర దుమారం రేపుతోంది. మరీ ముఖ్యంగా అధికారంలో ఉన్న మంత్రులకు నిద్రపట్టనీయకుండా చేస్తోంది. దేశంలోని 29 రాష్ర్టాల మంత్రుల జాబితాను వడపోసి తేల్చిన నిజాలు ఏంటంటే రెండు తెలుగు రాష్ట్రాల్లో ఉన్న చాలా మంది మంత్రులు నేరస్తులట. వివరాల్లోకి వెళ్లితే… ఏడీఆర్ సంస్థ తాజా నివేదిక ప్రకారం. కేసీఆర్ మంత్రివర్గంలో 53శాతం మందిపై తీవ్రమైన నేరాభియోగాలున్నట్లు స్పష్టంచేసింది. తీవ్రమైన నేరాలంటే వారెంట్ లేకుండానే అరెస్ట్ చేయదగ్గవి, కోర్టు అనుమతితో పనిలేకుండా దర్యాప్తు జరపదగ్గవి, నేరం బహిర్గతమైనప్పుడు అక్కడికక్కడే ఎఫ్ఐఆర్ నమోదు చేయదగినవి. ఇటువంటి సీరియస్ అఫెన్స్ రుజువైతే మూడేళ్ల కనీస జైలుశిక్ష ఖాయం. హత్య, మానభంగం, చోరీలను సీరియస్ అఫెన్సెస్ జాబితాలో చేరుస్తూ 2013 నవంబర్ 12న సుప్రీంకోర్టు తీర్పువెల్లడించింది. నమోదైన నేరాల ప్రస్తావనే తప్ప వాటి దర్యాప్తు స్థితిగతులకు సంబంధించిన వివరాలు ఎన్నికల అఫిడవిట్లో వుండవు.
గతంలో యూపీ, బీహార్ రాష్ర్టాలు మాత్రమే తీవ్ర నేరాల జాబితాలో వుండేవి. ఇప్పుడైతే ఈ పరిస్థితి దాదాపు అన్ని రాష్ర్టాల్లోనూ కనిపిస్తోంది. ఇక ఆంధ్రప్రదేశ్ విషయానికి వస్తే ముఖ్యమంత్రి చంద్రబాబు కేబినెట్లో అపర కోటీశ్వరులు ఉన్నారని పేర్కొంది. మంత్రి నారాయణ దేశంలోని మంత్రులందరికంటే ధనవంతుడని చెబుతూనే బాబు కేబినెట్లో కూడా నేస్థులు ఉన్నారని తేల్చేసింది. మంత్రి దేవినేని ఉమా మహేశ్వరరావు, అచ్చెన్నాయుడులు మహిళలను వేధించిన కేసుల్లో ఉన్నారని పేర్కొంది. సచ్చీలుగా పేరుకున్న కేజ్రీవాల్ కేబినెట్లోనే నలుగురు క్రిమినల్స్ వున్నట్లు, 11 మంత్రులున్న జార్ఖండ్ మినిస్ర్టీలో ఏకంగా 9 మంది నేరస్తులుగా నమోదైనట్టు ఏడీఆర్ రిపోర్ట్ చెబుతోంది.
If you like to publish news or your story on our website, please email to editor 'at' deccanabroad.com.