Loading...
You are here:  Home  >  Daily News  >  Current Article

Again discussion on Rajinikanth political entry..?

By   /  March 22, 2017  /  Comments Off on Again discussion on Rajinikanth political entry..?

    Print       Email

Rajinikanth tweet to Pv Sindhu 2మరోసారి తెరపైకి రజినికాంత్ పొలిటికల్ ఎంట్రీ..?

 

InCorpTaxAct
Suvidha

 

 

తమిళ తలైవా రజనీకాంత్ పొలిటికల్ ఎంట్రీపై చాలాసార్లు ప్రచారం సాగింది. ఎన్నో సార్లు రజిని కాంత్ రాజకీయాల్లోకి వస్తున్నారని వార్తలు వచ్చాయి. అయితే ప్రతిసారి ఆయన మౌనమే సమాధానం అన్నట్లుగా ప్రవర్తించారు. ఈ మధ్య జయలలిత మరణం తర్వాత రజినీ రాజకీయాల్లోకి వస్తున్నారని ప్రచారం సాగిన విషయం తెలిసిందే. అయితే తర్వాత అదంతా ఉత్తిదే అని తేలిపోయింది. ఇక జయలలిత మృతితో ఆర్ కె నగర్ నియోజకవర్గంలో వచ్చే నెల ఉప ఎన్నిక జరగనుంది.

ఇక బీజేపీకి చెందిన గంగై అమరన్ అనే నేత మంగళవారం రజనీకాంత్ తో భేటీ అయ్యారు. గంగై అమరన్ ఆ స్థానం నుంచి ఉప ఎన్నికల్లో బీజేపీ తరఫున పోటీ చేస్తున్నారు.ఆయన రజనీ కాంత్‌తో భేటీ అవ‌‌డంతో మ‌రోసారి ఆస‌క్తి కలిగిస్తోంది. అమరన్ ప్రముఖ మ్యూజిక్ డైరెక్టర్ ఇళయరాజాకు సోదరుడు అన్న విషయం తెలిసిందే. ఇలాగే గతంలో రజనీకాంత్ ని ప్రధాని మోదీ కలిసినప్పుడు ఆయన బీజేపీ చురుతున్నారని ప్రచారం సాగింది. తాజాగా అదే పార్టీకి చెందిన అభ్యర్ధి రజనీకాంత్ ని కలవడంతో రాజకీయ వర్గాల్లో ఆశక్తి కలిగిస్తోంది.

InCorpTaxAct

If you like to publish news or your story on our website, please email to editor 'at' deccanabroad.com.


    Print       Email

You might also like...

Vanisri Birthday Special on SakshiTV : Aug 3rd 2:30 PM EDT

Read More →