Loading...
You are here:  Home  >  Daily News  >  Current Article

Against gun fires in New York Methodist church..

By   /  November 18, 2017  /  Comments Off on Against gun fires in New York Methodist church..

    Print       Email

న్యూయార్క్ లోని ఈస్ట్ టెన్నిసీలో కాల్పులు ఘటన..

 

InCorpTaxAct
Suvidha

 

 

అమెరికాలోని టెక్సాస్‌ లోని విల్సన్ కంట్రీలోని ఫస్ట్ బాప్టిస్ట్ చర్చిలో 26 మంది కాల్పుల కారణంగా మృతి చెందిన విషయం తెలిసిందే. ఈ ఘటన మరువక ముందే న్యూయార్క్ లోని ఈస్ట్ టెన్నిసీలోని యునైటెడ్ మెథడిస్ట్ చర్చ్ లో మరో కాల్పుల ఘటన చోటు చేసుకుంది. ఇద్దరు వ్యక్తులకు గాయాలు అయ్యాయి. ఈస్ట్‌ టెన్నెసీ చర్చ్‌ లో థాంక్స్‌ గివింగ్‌ విందును నిర్వహించారు. ఈ విందుకు సుమారు 20 మంది సీనియర్ సిటిజన్స్ ‌హాజరయ్యారు. ఈ మధ్యకాలంలో చోటుచేసుకున్న కాల్పుల్లో బలైనవారికి సంతాపం తెలిపారు.

ఆ తర్వాత అదే చర్చికి చెందిన పెద్దాయన (81) తన వెంట తెచ్చుకున్న 38-కాలిబర్ రగ్గర్ హ్యాండ్‌ గన్‌ ను ఓపెన్‌ చేశాడు. మ్యాగజైన్‌ లోడ్‌ చేసి ఎలా వినియోగించాలో అందరికి తెలిపాడు. తర్వాత దాన్ని పక్కన బెట్టాడు. ఇంతలో మరో వ్యక్తి తనకు మరోసారి చూపించాలంటూ పొరపాటున ట్రిగ్గర్ నొక్కాడు. దీంతో ఓ వ్యక్తి చేతిలోంచి బుల్లెట్ దూసుకెళ్ళింది. ఆ తర్వాత పక్కనే ఉన్న ఓ మహిళ పొట్ట, ముంజేతిలోకి కూడా బుల్లెట్ దూసుకెళ్ళింది. వారిని హుటాహుటిన ఆస్పత్రికి తరలించారు. వారి ఆరోట్య పరిస్థితి నిలకడగా ఉందని వైద్యులు తెలిపారు. ఈ ఘటన ప్రమాదవశాత్తు చోటు చేసుకోవడంతో పోలీసులు ఎవరిపై కేసు నమోదు చేయలేదు.

InCorpTaxAct

If you like to publish news or your story on our website, please email to editor 'at' deccanabroad.com.


    Print       Email

You might also like...

Vanisri Birthday Special on SakshiTV : Aug 3rd 2:30 PM EDT

Read More →