Loading...
You are here:  Home  >  Community News  >  Current Article

AIADMK Jaya is all ‘FREE’ amma :)

By   /  May 6, 2016  /  Comments Off on AIADMK Jaya is all ‘FREE’ amma :)

    Print       Email

21TH_JAYALALITHAA_962438g`ఆల్ ఫ్రీ` అమ్మ‌

 

InCorpTaxAct
Suvidha

 

ఓట‌ర్ల‌పై జ‌య‌ల‌లిత వ‌రాల జ‌ల్లు
ఇంటికో ఉద్యోగం.. రేష‌న్ కార్డు ఉంటే ఉచిత సెల్‌ఫోన్‌
మేనిఫెస్టో విడుద‌ల చేసిన త‌మిళ‌నాడు సీఎం

త‌మిళ‌నాడు ముఖ్య‌మంత్రి జ‌య‌ల‌లిత ఓట‌ర్ల‌పై వ‌రాల జ‌ల్లు కురిపిస్తోంది. ఉచితంగా మొబైల్ ఫోన్ల ద‌గ్గ‌రి నుంచి ఇంటికో ఉద్యోగం వ‌ర‌కు అన్నీ ఫ్రీ అంటూ ప్ర‌క‌టించింది. త‌మిళ‌నాడులో ఈ నెల 16న జ‌ర‌గ‌నున్న అసెంబ్లీ ఎన్నిక‌ల సంద‌ర్భంగా అన్నాడీఎంకే అధినేత జ‌య‌ల‌లిత విడుద‌ల చేసిన మేనిఫెస్టోను ఒక‌సారి ప‌రిశీలిస్తే అందులో త‌మిళ‌నాడు ఓట‌రు అయి ఉంటే చాలా అన్నీ వాళ్ల ద‌గ్గ‌రికే ఉచితంగా వ‌చ్చి చేరుతాయ‌న్న‌ట్లుగా ఉంది. రేషన్‌కార్డు కలిగిన వారందరికీ ఉచితంగా మొబైల్ ఫోన్లు పంపిణీచేస్తామని, టీవీ సెట్‌టాప్ బాక్స్‌లు అందజేస్తామని, నిరుపేద కుటుంబాలకు ఉచితంగా 100 యూనిట్ల విద్యుత్ సరఫరా, బహిరంగ ప్రదేశాల్లో వై-ఫై సేవలు అందుబాటులోకి తేస్తామని ప్రకటించారు.
వృత్తి నైపుణ్యంలో శిక్షణతోపాటు ప్రతి కుటుంబంలో ఒకరికి ఉద్యోగం అని, ప్రస్తుత పంపిణీ విధానం ప్రాతిపదికన ప్రతి రెండు నెలలకు ఒక కుటుంబానికి 100 యూనిట్ల విద్యుత్ ఉచిత సరఫరా అని, 78 లక్షల వినియోగదారులు బిల్లులు చెల్లించనవసరం లేద‌ని అందులో పేర్కొన్నారు. సహకార రుణాల మాఫీతోపాటు తొలితరం పారిశ్రామిక వేత్తల ప్రోత్సాహానికి రూ.500 కోట్ల అమ్మ వెంచర్ క్యాపిటల్ ఫండ్ ఏర్పాటు చేస్తున్న‌ట్లు పేర్కొన్నారు. అయితే గ‌తంలో ఆంధ్ర‌ప్ర‌దేశ్‌లో కూడా చంద్ర‌బాబు ఆల్‌ఫ్రీ అన్నా కూడా ప్ర‌జ‌లు న‌మ్మ‌లేదు. మ‌రి గెలుపే ల‌క్ష్యంగా జ‌య‌ల‌లిత ప్ర‌క‌టించిన హామీల‌ను త‌మిళ తంబీలు ఎంత‌వ‌ర‌కు న‌మ్ముతారో ఏమో చూడాలి.

InCorpTaxAct

If you like to publish news or your story on our website, please email to editor 'at' deccanabroad.com.


    Print       Email

You might also like...

Vanisri Birthday Special on SakshiTV : Aug 3rd 2:30 PM EDT

Read More →