స్టార్ యాంకర్ తో అఖిల్ డేటింగ్..
అక్కినేని వారసులుగా వచ్చిన చైతూ, అఖిల్ కొద్దిరోజులుగా ప్రేమ, పెళ్ళి పేరు చెప్పి వార్తల్లో నిలిచారు. అయితే చైతూ ప్రియురాలు సమంతకు నాగార్జున గట్టి వార్నింగ్ ఇవ్వడంతో కాస్త ఇంట్రాక్షన్ తగ్గించి సైలెంట్ అయిపోయింది. దీంతో అంతా సద్దుమణిగింది అనుకున్నారంతా. అయితే ఇప్పుడు డేటింగ్ పేరుతో అఖిల్ వార్తల్లో నిలిచాడు.
అదీ.. స్టార్ యాంకర్ గా పేరు సంపాదించుకున్న అనసూయతో డేటింగ్ చేయబోతున్నాడు అంటూ ప్రచారం జరుగుతోంది. అయితే మీరనుకుంటున్నట్లు ఇది ఆ డేటింగ్ కాదు. స్టార్ యాంకర్ అనసూయ ఓ ప్రముఖ ఛానల్ లో ‘ఏ డేట్ విత్ అనసూయ’ కార్యక్రమాన్ని నిర్వహిస్తోంది. ఇది ఆదివారం నుంచి ప్రారంభం కానుంది. ఈ షోకి మొదటి గెస్ట్ గా అక్కినేని అఖిల్ ను ఆహ్వానించారు. ఈ షోకి సంబంధించి ఇప్పటికే షూటింగ్ కూడా జరిగిపోయింది. ఇందులో అఖిల్ తన లవ్ మేటర్ దగ్గర నుంచి తన తర్వాతి సినిమాల విశేషాలను తెలియజేయనున్నట్లు సమాచారం. ఇక అనసూయ ఈ షో పేరు చెప్పి భారీగా రెమ్యునరేషన్ తీసుకుంటున్నట్లు సమాచారం.
If you like to publish news or your story on our website, please email to editor 'at' deccanabroad.com.