‘మన్మథుడు 2’లో అక్కినేని అఖిల్..?
అక్కినేని అఖిల్ ఫస్ట్ మూవీ ‘అఖిల్’తో ఎంట్రీ ఇచ్చాడు. అది కాస్తా ఫ్లాప్ కావడంతో రెండో సినిమాపై ఆచితూచి అడుగులు వేస్తున్నాడు. ఈ సారి కమర్షియల్ సినిమా జోలికి పోకుండా జాగ్రత్తలు తీసుకుంటున్నాడట. ముఖ్యంగా సేఫ్ జోన్ లో సినిమా చేయాలని స్కెచ్ వేసుకున్నాడని తెలుస్తోంది. అందుకే సేఫెస్ట్ ప్రాజెక్ట్ చేసే పనిలో బిజీ బిజీగా ఉన్నాడట. అక్కినేని నాగార్జున కెరీర్ లో ‘మన్మథుడు’ సినిమాకు ఓ ప్రత్యేకత ఉంది. ఈ సినిమాను ఇప్పటికీ ప్రేక్షకులు టీవీల్లో ఆదరిస్తూనే ఉన్నారు. దీంతో ఈ చిత్రానికి ఫ్రీక్వెల్ గాని, సీక్వెల్ గాని చేయాలన్న ఆలోచనలో అఖిల్ ఉన్నాడట.
ఈ చిత్రం గురించి మాటల మాంత్రికుడు త్రివిక్రమ్ తో కూడా చర్చలు జరిగాయట. అఖిల్ సినిమా కోసం దర్శకుల్ని వేతికే పనికోసం నాగార్జున త్రివిక్రమ్ ని కలిశారట. ‘మన్మథుడు’ లాంటి కథనే మరొకటి తయారు చేయాలని కోరినట్లు టాక్. ‘మన్మథుడు’లో నాగ్ క్యారెక్టర్ ని ఎక్స్ టెన్షన్ చేసేలా కథ ఉండాలని త్రివిక్రమ్ కు చెప్పారట. ప్రస్తుతం త్రివిక్రమ్ ఆ పనిలో బిజీ బిజీగా ఉన్నారని సమాచారం. అలాంటి క్యారెక్టర్ కి అఖిల్ బాగా సూట్ అవుతాడని నాగ్ నమ్మకం. మరి ‘మన్మథుడు 2’ నిజంగానే వర్క్ అవుట్ అవుతుందా అన్నది వేచి చూడాల్సిందే.
If you like to publish news or your story on our website, please email to editor 'at' deccanabroad.com.