Loading...
You are here:  Home  >  Featured News  >  Current Article

Akkineni Brothers Love story

By   /  June 28, 2016  /  Comments Off on Akkineni Brothers Love story

    Print       Email

Akkineniఅక్కినేని బ్ర‌ద‌ర్స్ అలా ఫిక్స‌య్యారా?

 

InCorpTaxAct
Suvidha

 

అక్కినేని నాగార్జున త‌న‌యులు అక్కినేని అఖిల్‌, నాగ‌చైత‌న్య‌లు ఇద్ద‌రూ ప్రేమ పెళ్లిళ్లు చేసుకోనున్నార‌ని ఎప్ప‌టి నుంచో పుకార్లు షికార్లు చేస్తున్నాయి. అంతేకాదు ఇద్ద‌రిది ఒకేసారి ఎంగేజ్‌మెంట్ కూడా చేసుకోనున్నార‌ని వార్త‌లువ‌స్తున్నాయి. నాగ‌చైత‌న్య – స‌మంత‌ల ప్రేమ వ్య‌వ‌హారం ఇటీవ‌లి కాలంలో టాలీవుడ్ స‌ర్కిల్స్‌లోనూ.. అటు కామ‌న్ జ‌నంలో బాగానే పాపుల‌ర్ అయ్యింది. రేపో మాపో ఎంగేజ్మెంట్ కూడా చేసుకుంటార‌ని ప్ర‌చార‌మ‌వుతోంది. అయితే ఆ ఎపిసోడ్ల వేడి త‌గ్గ‌కముందే అదే ఫ్యామిలీ నుంచి పైగా చైతూకి స్వ‌యంగా త‌మ్ముడు అయిన అఖిల్ పైనా అదే త‌ర‌హా రూమ‌ర్లు న‌డుస్తున్నాయి. ఓ ప్ర‌ముఖ ఆంగ్ల ప‌త్రిక క‌థ‌నం ప్ర‌కారం.. వివ‌రాలిలా ఉన్నాయి… అఖిల్ హైద‌రాబాద్‌కి చెందిన ఓ బిజినెస్ మ్యాగ్నెట్ డాట‌ర్‌ని ప్రేమించాడ‌ట‌. ఆ ఇద్ద‌రూ చెట్టాప‌ట్టాల్ వేసుకుని తిరిగేస్తున్నార‌ట‌. ఇంట్లో కూడా అంద‌రికీ ఆ అమ్మాయిని పరిచ‌యం చేసేశాడ‌ట కూడా. ఇంత‌కీ అఖిల్ వ‌ల‌చిన ఆ సోగ్గ‌త్తె ఎవ‌రనేగా మీ అనుమానం. ఆ అమ్మాయి పేరు శ్రేయా భూపాల్ అట హైద‌రాబాద్‌ న‌గ‌రంలో ఫేమ‌స్ బిజినెస్ ఉమెన్ షాలిని భూపాల్ త‌న‌య‌ని ఆ ఆంగ్ల ప‌త్రిక క‌థ‌నం సారాంశం. అయితే స‌మంత‌తో అన్న‌కు… భూపాల్‌తో త‌మ్ముడికి నిశ్చితార్థం వ‌చ్చే నెల‌లోనే అంటూ ఫిల్మ్‌న‌గ‌ర్ టాక్‌.

InCorpTaxAct

If you like to publish news or your story on our website, please email to editor 'at' deccanabroad.com.


    Print       Email

You might also like...

Vanisri Birthday Special on SakshiTV : Aug 3rd 2:30 PM EDT

Read More →