Loading...
You are here:  Home  >  Community Events  >  Current Article

Ala Vaikuntapuramlo movie review 3.25/5

By   /  January 12, 2020  /  No Comments

    Print       Email

‘అల వైకుంఠపురములో’ రివ్యూ


‘జులాయి’.. ‘S/o సత్యమూర్తి’ లాంటి హిట్స్ తర్వాత అల్లు అర్జున్- త్రివిక్రమ్ శ్రీనివాస్ కాంబినేషన్లో, గీతా ఆర్ట్స్ స‌మ‌ర్ప‌ణ‌లో తెర‌కెక్కిన చిత్రం “అల వైకుంఠపురములో.  అల్లు అర్జున్, పూజా హెగ్డే జంటగా నటించిన ఈ చిత్రానికి మాటల మాంత్రికుడు త్రివిక్రమ్ దర్శకత్వం వహించిగా, తమన్ సంగీతం స‌మ‌కూర్చారు.  టబు, సునీల్, సుశాంత్, నవదీప్, రాహుల్ రామకృష్ణ తదితరులు నటించారు. దాదాపు 2 ఏళ్లు గ్యాప్ తీసుకుని  ప్రేక్ష‌కుల ముందుకు వ‌స్తున్నారు స్టైలిష్ స్టార్ సంక్రాంతి రేసులో విజ‌యం సాధిస్తారా?  లేదా? అన్న‌ది మ‌రికొన్ని గంట‌ల్లో తేలిపోనుంది. ఇక క‌థ‌లోకి వెళ్తే….

InCorpTaxAct
Suvidha

కథ:
బంటు (అల్లు అర్జున్) అంటే మొదటినుండి తన తండ్రి వాల్మీకి (మురళీ శర్మ)కి పడదు. తనకు కావాల్సింది ఇవ్వకపోవడం, సరిగ్గా చూడకపోవడం చేస్తూ ఉంటాడు. చిన్నప్పటినుండి అదే ఫ్రస్ట్రేషన్ తో పెరిగిన బంటు తన బాస్ (పూజ హెగ్డే)ను చూసి ప్రేమలో పడతాడు. ఇదిలా జరుగుతుండగా రామ చంద్ర (జయరాం) తన కొడుకు సుశాంత్ కు పూజ హెగ్డేను ఇచ్చి పెళ్లి చేయాలనుకుంటాడు. రామ చంద్ర బిజినెస్ పై కన్నేసిన విలన్ (సముద్రఖని) అతనిపై దాడి చేయిస్తాడు. అయితే అది ఇటు తిరిగి ఇటు తిరిగి, బంటుకి తన జీవితంలో జరిగిన అతిపెద్ద ట్విస్ట్ రివీల్ అవుతుంది. దాంతో జయరాం అండ్ ఫామిలీ ఉంటోన్న వైకుంఠపురం (వాళ్ళ ఇల్లు) వెళ్తాడు. అక్కడ బంటుకి ఎదురైన పరిస్థితులేంటి? అసలు బంటుకి తెలిసిన నిజమేంటి? ఎందుకని వాళ్ళ నాన్న బంటుని ద్వేషిస్తాడు? చివరికి తన బాస్ తో ప్రేమాయణం ఏమైంది? వంటి ప్రశ్నలకు సమాధానాలు సిల్వర్ స్క్రీన్ పై చూడాల్సిందే.

విశ్లేష‌ణ‌:
అల్లు అర్జున్ వన్ మాన్ ఆర్మీలా సినిమా మొదటి నుంచి చివరి దాకా తన పెర్ఫార్మన్స్ తో ఆకట్టుకుంటూ వచ్చాడు. అల్లు అర్జున్ మరోసారి కామెడీ టైమింగ్ తో మెప్పించాడు. కానీ అన్నిటికంటే మించి ఇప్పటి వరకూ ఎమోషనల్ గా ఇంత హై ఉన్న పాత్ర చేయలేదు. సో ఎమోషనల్ గా అల్లు అర్జున్ ని నెక్స్ట్ లెవల్ కి తీసుకెళ్లిందని చెప్పాలి.   ఇంటెర్వెల్ బ్లాక్ తో ప్రేక్షకులని కట్టి పడేశాడు త్రివిక్రమ్. కామెడీ, యాక్షన్, ఎంటర్టైన్మెంట్ లో తన కి ఉన్న ఫుల్ టాలెంట్ ని త్రివిక్రమ్ ఈ సినిమా తో బయటకి తీశాడు . అసలు సినిమా మొదలైన ముప్పై నిమిషాల్లో త్రివిక్రమ్ తన మార్క్ ని చూపించే ప్రయత్నం లో విజ‌య‌వంతం అయ్యారు . “ఇంట్లో దీపం పెడితే అది ఒక్క ఆ ఇంటికే , అదే గుడిలో పెడితే ఊరంతటికి“.  “చేతిలో చిల్లర లేదు , పెద్ద నోటు ఏమో ఇవ్వలేను“  ఇలాంటి డైలాగులతో వింటేజ్ గా సినిమా ని నడిపించాడు . తాను ఏ ఫామిలీ డ్రామాల జోనర్ తీయడం లో త్రివిక్రమ్ పర్ఫెక్ట్ అని చెప్పుకుంటాడో అలాంటి కథే ఎంచుకుని బలం ఇచ్చాడు సబ్జెక్ట్ కి. ఫ్యామిలీ ఆడియన్స్ కి బాగా కనక్ట్ అయ్యేలా ఎమోషన్లని జాగ్రత్తగా హ్యాండిల్ చేశాడు .

ఫస్ట్ హాఫ్ కథ లో కాస్తంత సాగదీత కనిపిస్తుంది. హీరోయిన్ అయినా పూజ హెగ్డే పాత్ర చెప్పుకోదగినది ఏం కాదు. కానీ ఫస్ట్ హాఫ్ లో తన లవ్ ట్రాక్ లో చాలా బ్యూటిఫుల్ గా కనిపించింది.సుశాంత్ ది ముఖ్య పాత్రే అయినా పెద్దగా డైలాగ్స్, చెప్పుకోదగిన పెర్ఫార్మన్స్ ఉండదు. నవదీప్, రాహుల్ రామకృష్ణ, రాజేంద్ర ప్రసాద్, హర్ష వర్ధన్ లు అక్కడక్కడా నవ్వించారు. కానీ సునీల్ పాత్రే పెద్దగా ఉపయోగం లేకుండా పోయింది.

ప్లస్ పాయింట్స్ :

అల్లు అర్జున్
మురళి శర్మ
మ్యూజిక్ / పాటలు

మైనస్ పాయింట్స్ :

ఫస్ట్ హాఫ్ సాగదీత
పాటలతో క్లైమాక్స్ ఫైట్

తీర్పు:
కుటుంబ స‌మేతంగా చూడ‌ద‌గ్గ సినిమా. బ‌న్నీని ఈ సినిమా నెక్ట్స్ లెవెల్‌కు తీసుకెళ్తుంద‌న‌డంలో ఎలాంటి అతిశ‌యోక్తి లేదు.

రేటింగ్ : 3.25 /5

InCorpTaxAct

If you like to publish news or your story on our website, please email to editor 'at' deccanabroad.com.


    Print       Email

Leave a Reply

You might also like...

Vanisri Birthday Special on SakshiTV : Aug 3rd 2:30 PM EDT

Read More →