Loading...
You are here:  Home  >  Daily News  >  Current Article

All is not well with Tamil Nadu, says actor-turned-politician Kamal Hassan

By   /  February 11, 2018  /  Comments Off on All is not well with Tamil Nadu, says actor-turned-politician Kamal Hassan

    Print       Email

రజినీ రాజకీయాల్లో ‘కాషాయం’ ఉండదు : కమల్

 

InCorpTaxAct
Suvidha

 

 

తమిళనాడులో రాజకీయాల్లో ప్రతిరోజూ ఏదో ఒక ట్విస్ట్ నెలకొంటున్న విషయం తెలిసిందే. ప్రస్తుతం అక్కడ అన్నాడీఎంకే, డీఎంకే పార్టీలు ఢీ అంటే ఢీ అంటున్నాయి. తాజాగా తమిళనాడు రాజకీయాల్లో సూపర్‌ స్టార్లు కమల్ హాసన్, రజినీకాంత్ ఇంచుమించు ఏకకాలంలో కొత్త పార్టీలతో ప్రజల ముందుకు రానుండటం ఆ రాష్ట్ర రాజకీయ వాతావరణాన్ని వేడెక్కిస్తోంది. అయితే రజినీకాంత్ తన రాజకీయాల్లో వాయిలెన్స్ కి ఏమాత్రం చోటు ఉండదని.. ఆద్యాత్మికతో ఉంటుందని ఆ మద్య ప్రకటించారు.

అయితే కమల్, రజినీలు రాజకీయాల్లో పొత్తు ఉంటుందా అన్న విషయంపై చర్చలు నడుస్తున్నాయి. దీనిపై కమల్ హాసన్ మాట్లాడుతూ.. రజినీ రాజకీయాల్లో కాషాయం జోడింపు ఉంటుందనే మాట వినిపిస్తోంది. అదే నిజమైతే ఆయనతో పొత్తు ఆలోచనే చేసేది లేదు. రజినీ నాకు మంచి మిత్రుడే.. కానీ మిత్రత్వం వేరు, రాజకీయాలు వేరు అని కమల్ చెప్పారు. ఎన్నికల్లో చేతులు కలపే విషయంలో తాను, రజినీ తప్పనిసరిగా ఆలోచించాల్సి ఉంటుందని ఇటీవల కమల్ వ్యాఖ్యానించారు. ఈనెల 21న కమల్ తన రాజకీయ పార్టీ పేరును ప్రకటించడంతో పాటు రాజకీయ పర్యటనకు కూడా శ్రీకారం చుట్టబోతున్నారు.

InCorpTaxAct

If you like to publish news or your story on our website, please email to editor 'at' deccanabroad.com.


    Print       Email

You might also like...

Vanisri Birthday Special on SakshiTV : Aug 3rd 2:30 PM EDT

Read More →