Loading...
You are here:  Home  >  Daily News  >  Current Article

All set for KCR and Deve Gouda meet

By   /  April 12, 2018  /  Comments Off on All set for KCR and Deve Gouda meet

    Print       Email

13న దేవేగౌడ‌తో కేసీఆర్ భేటీ

InCorpTaxAct
Suvidha

 

 

 

* `ఫెడ‌ర‌ల్ ఫ్రంట్` దిశ‌గా మ‌రో కీల‌క అడుగు

* దేశ రాజ‌కీయాల్లో గుణాత్మ‌క మార్పే ల‌క్ష్యంగా కేసీఆర్ దేశ‌వ్యాప్తంగా ప‌ర్య‌ట‌న‌

* ఇప్ప‌టికే మ‌మ‌త‌ను, హేమంత్ సోరెన్‌ను క‌లిసిన కేసీఆర్‌

* కేసీఆర్‌కు మ‌రికొన్ని పార్టీలు మ‌ద్ద‌తు తెలిపే అవ‌కాశం ఉందంటున్న రాజ‌కీయ విశ్లేష‌కులు

డెక్క‌న్ అబ్రాడ్‌: తెలంగాణ ముఖ్య‌మంత్రి కె.చంద్ర‌శేఖ‌ర్ రావు `ఫెడ‌ర‌ల్ ఫ్రంట్‌` ఏర్పాటు దిశగా మరో కీలక అడుగు వేయనున్నారు. ఈ మేరకు ఆయన కార్యచరణ రూపొందింది. ఇందులో భాగంగా ఏప్రిల్ 13న కేసీఆర్ బెంగళూరు వెళ్లనున్నారు. ఉదయం 9.45 గంటలకు బేగంపేట విమానాశ్రయం నుంచి ప్రత్యేక విమానంలో బయలుదేరి బెంగళూరు చేరుకుంటారు. అనంతరం దేవేగౌడతో భేటీ కానున్నారు. ఈ సందర్భంగా దేశ రాజకీయాలపై ఆయనతో చర్చించనున్నారు. అనంతరం సాయంత్రం 5 గంటలకు ఆయన తిరిగి హైదరాబాద్ చేరుకుంటారు. ఇప్పటికే ‘ఫెడరల్ ఫ్రంట్’ ఏర్పాటు కోసం పశ్చిమ బెంగాల్ ముఖ్యమంత్రి మమతా బెనర్జీతోనూ కేసీఆర్ భేటీ అయ్యారు. జార్ఖండ్ మాజీ సీఎం హేమంత్ సోరెన్ హైదరాబాద్ వచ్చి కేసీఆర్‌ను కలిసిన సంగతి విధిత‌మే. వీరేకాక… ఇప్పటికే జాతీయంగా అనేక పార్టీలు కూడా కేసీఆర్ ఏర్పాటుచేయబోయే ఫెడరల్ ఫ్రంట్‌కు తమ మద్ధతును తెలుపుతున్నాయి.

దేశ రాజకీయాల్లో గుణాత్మక మార్పే లక్ష్యంగా కేసీఆర్‌ దేశవ్యాప్తంగా పర్యటిస్తున్నారు. ఈ నేపథ్యంలో దేశంలోని వివిధ రాజకీయ పార్టీల నేతలతో కేసీఆర్‌ సమావేశమవుతున్నారు. అయితే భార‌తీయ జ‌న‌తాపార్టీ, కాంగ్రెస్ పార్టీలు కేంద్రంలో అధికారంలో ఉంటున్నాయిని, ఇవి రెండు కూడా ప్ర‌జ‌ల‌కు పెద్ద‌గా చేసింది ఏమీ లేద‌ని, అందుకే `ఫెడ‌ర‌ల్ ఫ్రంట్` ఏర్పాటు చేస్తున్నామ‌ని చెప్పిన కేసీఆర్‌కు దేశ  రాజ‌కీయాల్లో బాగానే మ‌ద్ద‌తు ల‌భిస్తోంద‌ని, మ‌రికొన్ని పార్టీలు కూడా కేసీఆర్‌కు మ‌ద్ద‌తు తెలిపే అవ‌కాశం ఉంద‌ని రాజ‌కీయ విశ్లేష‌కులు అంటున్నారు.

InCorpTaxAct

If you like to publish news or your story on our website, please email to editor 'at' deccanabroad.com.


    Print       Email

You might also like...

Vanisri Birthday Special on SakshiTV : Aug 3rd 2:30 PM EDT

Read More →