పుష్కరాలకు సర్వం సిద్ధం
కృష్ణా తీరంలో పుష్కర సంరంభం ప్రారంభమైంది. పుష్కరాలకు కేటాయించిన వేలాదిమంది సిబ్బంది బుధవారం నుండే విధుల్లో చేరారు. కృష్ణా, గుంటూరు, కర్నూలు జిల్లాలో దాదాపుగా 60 వేల మంది ఉద్యోగులు పుష్కర విధుల్లో నిమగమైనట్లు అధికారవర్గాలు తెలిపాయి. వివిధ జిల్లాల నుండి వలంటీర్లు పెద్ద సంఖ్యలో విజయవాడకు చేరుకున్నారు. బుధవారం మధ్యాహ్నాం నుండే వీరందరూ ఘాట్లవద్దకు చేరుకోవడంతో సందడి వాతావరణం నెలకొంది.పుష్కరనగర్లతో పాటు, ఘాట్లను పోలీసులు తమ ఆధీనంలోకి తీసుకున్నారు. విజయవాడలోని అన్ని ఘాట్ల వద్ద పెద్దసంఖ్యలో మొహరించిన పోలీసులు కనిపించారు. పారిశుద్ధ్య సిబ్బంది కూడా పెద్దసంఖ్యలో విజయవాడకు చేరుకున్నారు. మరోవైపు పుష్కర ప్రారంభాలకు సంకేతంగా గురువారం సాయంత్రం రాష్ట్ర ప్రభుత్వం కృష్ణాహారతిని, శోభా యాత్రను నిర్వహించనున్నారు. గురువారం ఉదయం ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు రాజమండ్రికి వెళ్లనున్నారు. అక్కడ గోదావరి అంత్యపుష్కరాల్లో పాల్గొని, సాయంత్రం విజయవాడలోని ఫెర్రీ ఘాట్‌కు చేరకుంటారు. రాజమండ్రి నుండి గోదావరి జలాలను కలశంలో తీసుకువచ్చి కృష్ణలో కలపనున్నారు. విజయవాడలోని దుర్గఘాట్‌లో కంచికామకోటి పీఠాధిపతి జయేంద్రసరస్వతి శుక్రవారం తెల్లవారుజామున పుష్కరస్నానాలు ప్రారంభించనున్నారు. ముఖ్యమంత్రి కూడా అదే ఘాట్‌లో ఉదయం 5.45 గంటలకు పుష్కరస్నానం ఆచరించున్నారు.
ప్రభుత్వం పుష్కరాలను ప్రతి ష్ఠాత్మకంగా స్వీక రించి కనీవినీ ఎరుగని రీతిలో నిర్వ హించేందుకు కసరత్తు చేస్తున్న ప్పటికీ ఏర్పాట్లు మాత్రం నత్తనడకన సాగుతున్నాయి. పుష్క రాల ప్రారంభానికి ఇంకా రెండు రోజులే ఉన్నప్పటికీ పుష్కరనగర్ల ఏర్పాటు పనులు ఇప్పటికీ ఒక కొలిక్కి రాకపోవడం ఆందోళన కలిగిస్తోంది. పుష్కరాలకు వివిధ ప్రాంతాల నుంచి పెద్దఎత్తున భక్తులు, యాత్రికులు విజయవాడ చేరుకుంటారని భావిస్తున్న అధికారులు వారికి తగిన సదుపాయాల కల్పనకు చర్యలు తీసుకుంటున్నారు. ప్రధానంగా సుదూర ప్రాంతాల ప్రజలు పుణ్యస్నానాలు ఆచరించేందుకు వివిధ మార్గాల ద్వారా నగరానికి చేరుకోనుండగా, వారి కోసం అన్ని మౌలిక వసతులతో కూడిన పుష్కరనగర్లను ఏర్పాటు చేస్తున్నారు. విజయవాడ నగరం లోపల 10, వెలుపల మరో 8 పుష్కరనగర్లు ఏర్పాటు చేస్తున్నారు. ఇవన్నీ పుష్కర స్నానఘాట్లకు సాధ్యమైనంత సమీపంలో ఉండేలా ఏర్పాటు చేస్తున్నారు.
If you like to publish news or your story on our website, please email to editor 'at' deccanabroad.com.