Loading...
You are here:  Home  >  Featured News  >  Current Article

Allari Naresh is now Selfie Raja..

By   /  March 13, 2016  /  Comments Off on Allari Naresh is now Selfie Raja..

    Print       Email

selfi raja

అల్లరోడు వెరైటీ ప్రచారం..!

InCorpTaxAct
Suvidha

 

సినిమాల ప్రచారంలో ఒక్కొక్కరూ ఒక్కోరకమైన శైలిలో దూసుకుపోతున్నారు. ఒకప్పుడు బాలీవుడ్ కి మాత్రమే పరిమితమైన మూవీ ప్రమోషన్స్.. ఇప్పుడు టాలీవుడ్ లో కూడా జోరుగా జరుగుతున్నాయి. ఇందులో ఫస్ట్ ప్లేస్ ఎవరిది అంటే రాజమౌళి పేరు చెప్పొచ్చు. బాహుబలి సినిమాపై అంచనాలు పెరిగేలా, క్రేజ్ వచ్చేలా చాలా తెలివిగా ఆయన సినిమాని ప్రమోట్ చేశారు. సినిమాలోని పాత్రలకు సంబంధించి పోస్టర్లను ఒక్కొక్కటిగా విడుదల చేస్తూ సెన్సెషన్ సృష్టించారు. అలా రిలీజ్ అయిన పోస్టర్లను చూసిన జనానికి సినిమాపై బాగా ఆశక్తి పెరిగింది .

 

తర్వాత రుద్రమ దేవి సినిమా విషయంలో గుణ శేఖర్ కూడా అదే రూట్ లో వెళ్ళారు. తర్వాత వీరి జాబితాలోకి అల్లరి నరేష్ కూడా వచ్చేశారు. రీసెంట్ గా ఈ అల్లరోడు చేసిన ప్రయోగం సక్సెస్ అయింది. సీబీఐ, బ్యాంకు అధికారులకు చిక్కని విజయ్ మాల్యా తన సెల్ఫీకి చిక్కారంటూ మాల్యాతో దిగిన ఫొటోను నరేష్ శనివారం తన ఫేస్ బుక్ లో పోస్ట్ చేసిన విషయం తెలిసిందే. ఇది కాస్తా సోషల్ మీడియాలో వైరల్ అయింది.

 

ఇంతకీ ఇది సెల్ఫీ రాజా మూవీ ప్రచారంలో భాగమట. సెల్పీ రాజాకి సెల్పీ ఒక వ్యసనం, ఒక బ‌ల‌హీన‌త అలాంటి సెల్ఫీరాజాను మీకు ప‌రిచ‌యం చేస్తున్నాం!. సెల్ఫీ కోసం అత‌ను ఏమైనా చేస్తాడు! ఇక మాల్యా త‌ర్వాత అత‌ని సెల్ఫీకి చిక్కేదెవ‌రు? ” అంటూ మ‌రో పోస్టు చేశారు అల్ల‌రి న‌రేష్‌. దీంతో ప్రేక్షకులు తర్వాత ఎవరు అనే అంశం గురించి చర్చించుకోవడం మొదలుపెట్టేశారు. మ‌రి చూద్దాం న‌రేష్ సెల్ఫీకి చిక్కేదెవ‌రో.. ?

InCorpTaxAct

If you like to publish news or your story on our website, please email to editor 'at' deccanabroad.com.


    Print       Email

You might also like...

Vanisri Birthday Special on SakshiTV : Aug 3rd 2:30 PM EDT

Read More →