బీజేపీతో సంకీర్ణం వీలునామా లాంటిది: మెహబూబా
జమ్మూ కశ్మీర్ పీడీపీ చీఫ్ మెహబూబా వివాదాస్పద వ్యాఖ్యలు చేశారు. బీజేపీతో కలిసి సంకీర్ణ ప్రభుత్వాన్ని నడపడమన్నది తన తండ్రి ముఫ్తీ మహ్మద్ సయీద్ పిల్లలకు రాసిన వీలునామా లాంటిదని అన్నారు. అంతేకాదు.. ఈ వీలునామా వల్ల తాము రాజకీయంగా నాశనమైపోయినా పర్వాలేదన్నారు. అయితే ఒప్పందాన్ని అమలుచేయడానికి మాత్రం సిద్ధంగా ఉన్నామన్నారు. సోమవారం ఆమె కుప్వాడాలో పార్టీ కార్యకర్తలను ఉద్దేశించి ప్రసంగించారు.
ఈ సందర్భంగా తమ తండ్రి మాట తనకు శిలాశాసనం లాంటిదన్నారు మెహబూబా. తన తండ్రి మాటను జవదాటబోమని స్పష్టంగా చెప్పారు. ‘ నేనో విషయం స్పష్టం చేయదలుచుకున్నా.. బీజేపీతో కలిసి సంకీర్ణ సర్కారు అన్నది సయీద్ తీసుకున్న నిర్ణయం.. దాన్ని ఖచ్చితంగా గౌరవిస్తాను.. ఒక తండ్రి పిల్లలకు వీలునామా రాశాడంటే.. దాన్ని అమలుపరచడం ద్వారా వాళ్లు నాశనమైపోయినా సరే.. దాన్ని తప్పనిసరిగా అమలు చేయాల్సిన బాధ్యత వారిపై ఉంటుంది’ అని మెహ్బూబా అన్నారు.
అయితే మెహబూబా నిన్న మొన్నటి వరకు బీజేపీకి రకరకాల కండీషన్లు పెట్టిన విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలో ఆమె ప్రభుత్వాన్ని ఏర్పాటు చేస్తున్నారా లేదా అనే విషయం తెలియాజేయాలంటూ ఒత్తిడి వచ్చిన విషయం తెలిసిందే.
If you like to publish news or your story on our website, please email to editor 'at' deccanabroad.com.