బన్నీ ఆ విషయం చెప్పేశాడు!
టాలీవుడ్ హీరోల్లో అల్లు అర్జున్ ఓ ప్రత్యేకమైన స్థానాన్ని సంపాదించుకున్నారు. మామ మెగా స్టార్ చిరంజీవి నుంచి చాలాపాఠాలు నేర్చుకున్న బన్ని సినిమాల్లో వరుస హిట్లతో దూసుకుపోతున్నారు. ఒక్క సినిమా విషయంలోనే కాదు. సోషియల్ మీడియాలో ఆయన ముందే ఉన్నారు. తన అభిమానులతో రెగ్యులర్గా టచ్లో ఉంటూ తన సినిమా విశేషాలను.. కుటుంబ విశేషాలను..ఆనందాలను ఫేస్బుక్.. ట్విట్టర్ ద్వారా అభిమానులతో పంచుకుంటూ ఉంటాడు. తాజాగా అభిమానులకో విషయాన్ని చెప్పారు. తాను తండ్రిని కాబోతున్నానని.. తన సతీమణి స్నేహ రెండో విడ్డకు జన్మనివ్వబోతోందన్న విషయాన్ని ఫేస్బుక్.. ట్విట్టర్లలో అభిమానులతో షేర్ చేసుకున్నాడు. అంతేకాదు అల్లు అర్జున్-స్నేహ సైతం రెండో బిడ్డకు వెల్కం చెబుతూ ఓ ఫొటో షూట్లో పాల్గొన్నారు.
అందులో ఓ అద్భుతమైన ఫొటోను ట్విట్టర్లో షేర్ చేశాడు బన్నీ. బన్నీ తన కొడుకు అయాన్ ను ఎత్తి పట్టుకుని ఉంటే.. ఆ బుడ్డోడు స్నేహ పొట్టకు ముద్దిస్తున్నాడు. బ్లాక్ అండ్ వైట్లో చూడగానే వావ్ అనిపించేలా ఉంది ఈ ఫొటో. తమ కుటుంబం మరింత పెద్దగా మారబోతోందని.. త్వరలోనే మరో బిడ్డకు తన భార్య జన్మనివ్వబోతోందని ట్వీట్ చేశాడు బన్నీ. 2011లో స్నేహను పెళ్లాడగా.. రెండేళ్ల కిందటే వీరికి అయాన్ పుట్టాడు. ఇంకో రెండు మూడు నెలల్లోనే స్నేహ రెండో బిడ్డకు జన్మనిచ్చే అవకాశముంది. మరి ఈసారి అల్లు ఇంట్లోకి ఇంకో అబ్బాయి వస్తాడా.. అమ్మాయి వస్తుందా అనేది వేచి చూడాలి.
If you like to publish news or your story on our website, please email to editor 'at' deccanabroad.com.