Loading...
You are here:  Home  >  Featured News  >  Current Article

Allu Arjun Completes 13 Years in Tollywood

By   /  March 31, 2016  /  Comments Off on Allu Arjun Completes 13 Years in Tollywood

    Print       Email

Actor-Allu-Arjun 1

అల్లు అర్జున్ 13 ఏళ్ళ ప్రస్థానం..

InCorpTaxAct
Suvidha

 

 

సరైనోడుతో తాను సరైనోడినని మరోసారి ప్రూవ్ చేసేందుకు రెడీ అవుతున్నాడు స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్ . ఈ యంగ్ హీరో మెగా ఫ్యామిలీ హీరోల్లో తనకంటూ ఓ ప్రత్యేకమైన ఇమేజ్ ని క్రియేట్ చేసుకున్నాడు. అంతేకాదు.. ప్రేక్షకుల మదిలో స్టైలిష్ స్టార్‌గా ఎదిగాడు. అల్లు అర్జున్ తన కెరీర్ ప్రారంభించి ఈ నెల 28తో 13 ఏళ్లు పూర్తయ్యాయి. రాఘవేంద్రరావు డైరెక్షన్ లో బన్నీ హీరోగా తెరకెక్కిన ఫస్ట్ మూవీ “గంగోత్రి” మార్చి 28, 2003లో రిలీజ్ అయింది. అయితే 28న బన్నీ మెగాస్టార్ చిరంజీవి కూతురు శ్రీజ పెళ్లి హడావుడిలో ఉన్నారు. అయినప్పటికీ.. ఈ విషయాన్ని ప్రత్యేకంగా గుర్తుచేసుకుని ట్విట్టర్ ద్వారా తన సంతోషాన్ని అభిమానులతో పంచుకున్నాడు.

తాను ఓ స్టార్ హీరోగా ఎదగడానికి సహకరించిన ప్రతీ ఒక్కరికి ఈ సందర్భంగా.. అల్లు అర్జున్ ట్విట్టర్ ద్వారా కృతజ్ఞతలు తెలియజేశాడు. ఇక ఏ స్టార్ హీరో కెరీర్ లోనైనా అప్ అండ్ డౌన్స్ ఉండటం కామన్. అల్లు అర్జున్ కూడా అడపాదడపా పరాజయాలు చవిచూసిన సందర్భాలున్నాయి. అయినా నిలకడగా తన కెరీర్ కొనసాగించి మొత్తం 16 సినిమాలను పూర్తి చేశాడు. అయితే బన్నీ కెరీర్‌ను పక్కగా ప్లాన్ చేయడం వెనుక… తండ్రి అల్లు అరవింద్ పాత్ర ఎంతో ఉంది. బన్నీ నటించిన 16వ సినిమా… “సరైనోడు” ఏప్రిల్-22న రిలీజ్ కాబోతోంది. రకుల్ ప్రీత్ సింగ్ హీరోయిన్‌గా నటించిన ఈ మూవీకి బోయపాటి శ్రీను దర్శకత్వం వహించాడు. ఈ సినిమాతో మరో బ్లాక్ బస్టర్ హిట్ కొట్టడం ఖాయమంటోంది “సరైనోడు” చిత్ర యూనిట్. ఇక అందరి అంచనాలు కూడా అదే రేంజ్ లో ఉన్నాయి.

InCorpTaxAct

If you like to publish news or your story on our website, please email to editor 'at' deccanabroad.com.


    Print       Email

You might also like...

Vanisri Birthday Special on SakshiTV : Aug 3rd 2:30 PM EDT

Read More →