బన్నీ ఎందుకలా అంటున్నాడు?
అల్లు అర్జున్ అలా ఎందుకు మాట్లాడతున్నాడో ఎవరికీ అంతపట్టడం లేదు. దేవునిలాగా పూజించే ఆ వ్యక్తిని ఇప్పుడు ఎందుకు పట్టించుకోవడం లేదబ్బా అంటూ బన్నీ అభిమానులతో పాటు సినీ ఇండస్ట్రీలో సైతం పెద్ద చర్చే నడుస్తోంది. సోషియల్ మీడియాలో ఇదే పెద్ద హాట్ టాపిక్ అయ్యింది. వివరాల్లోకి వెళ్తే… ఇటీవల సరైనోడు సక్సెస్ మీట్లో అభిమానులు పవన్ కల్యాణ్ గురించి చెప్పండి అని అడిగితే బన్నీ మాట్లాడిన `చెప్పను` బ్రదర్ అనే మాట మెగా అభిమానులను కాస్త కలవరపెడుతున్నట్టుగా తెలుస్తోంది. ఇప్పటి మెగా హీరోలు రామ్‌చరణ్, బన్నీ, సాయిధరమ్, వరుణ్ తేజ్‌లు కూడా పలు సందర్భాల్లో పవన్‌ను ఆకాశానికి ఎత్తిన దాఖలాలు ఉన్నాయి. అలాంటి తరుణంలో ఇప్పుడు ఈ `చెప్పను` బ్రదర్ అని ఎందుకన్నారు అంటూ సోషియల్ మీడియాలో పెద్ద చర్చ నడుస్తోంది.
అయితే తాజాగా ఓ ప్రముఖ దినపత్రిక అల్లు అర్జున్ స్పెషల్ ఇంటర్యూ తీసుకోగా, ఇందులో ఆసక్తికర విషయాలు వెల్లడించారు బన్నీ. ప్రస్తుతం సోషల్ మీడియాలో జరుగుతున్న చర్చ గురించి మీరు ఏం చెబుతారు అని ప్రశ్నించగా.. ’ఇప్పుడూ అదే మాట అంటున్నా.. పవన్ గురించి మాట్లాడను బ్రదర్. ఈ ప్రశ్న తప్ప ఇంకేదైనా అడగండి’ అని అన్నాడని తెలుస్తుంది. ఈ సమాధానం పవన్ కళ్యాణ్ అభిమానులకు అసంతృప్తికరంగా మారింది. అసలు చెప్పను బ్రదర్ అనే అంశం బన్నీ నోట నుండి రావడానికి కారణం ఏమయి ఉంటుందా అనేది మెగా అభిమానులకు అంతు చిక్కని ప్రశ్నగా మారింది. ఈ మాట బన్నీ నోట ఎందుకు వచ్చిందో తెలుసుకోవాలంటే మరికొన్ని రోజులు ఆగక తప్పదనిపిస్తోంది.
If you like to publish news or your story on our website, please email to editor 'at' deccanabroad.com.