Loading...
You are here:  Home  >  Daily News  >  Current Article

Allu Arjun once again acting with Ram Chanran..?

By   /  August 21, 2016  /  Comments Off on Allu Arjun once again acting with Ram Chanran..?

    Print       Email

allu arjun with ram charan 1మళ్ళీ స్క్రీన్ షేర్ చేసుకోబోతున్న చెర్రీ-బన్నీ..!

 

InCorpTaxAct
Suvidha

 

 

గతంలో టాలీవుడ్ లో మల్టీస్టారర్ సినిమాల ప్రశక్తే ఉండేది కాదు. అయితే ఇటీవలి కాలంలో ఇద్దరు హీరోలు కలిసి నటించిన సినిమాలు బాగానే వస్తున్నాయి. ముఖ్యంగా వెంకటేష్-మహేష్ బాబు కలిపి చేసిన ‘సీతమ్మ వాకిట్లో సిరిమల్లె చెట్టు’ మూవీతో దీనికి నాంది పడింది. తర్వాత వెంకటేష్-పవన్ కల్యాణ్ కాంబినేషన్ లో ‘గోపాల గోపాల’ ఓ రేంజ్ లో హిట్ సొంతం చేసుకుంది. అలాగే మెగా ఫ్యామిలీ హీరోల నుంచి కూడా కొన్ని కాంబినేషన్లు వచ్చాయి. ‘శంకర్ దాదా జిందాబాద్’ సినిమా చివరిలో పవన్ ఎంట్రీ ఇస్తారు. అది చిన్న సన్నివేశమే అయినా మంచి క్రేజ్ వచ్చింది. తర్వాత ‘ఎవడు’ మూవీలో చెర్రీ, బన్నీ నటించారు. అయితే ఇద్దరూ ఒకేసారి కనపించకపోయినా మంచి క్రేజ్ వచ్చింది.

ఇప్పుడు ఈ ఇద్దరు హీరోలు మళ్ళీ తెరపై కనిపించబోతున్నారట. ప్రెజెంట్ చెర్రీ నటిస్తున్న ‘ధృవ’ సినిమాలో బన్నీ కూడా కనిపించబోతున్నారని టాక్. రామ్ చరణ్ కోసం ఎలాంటి క్యారెక్టర్ చేసేందుకైనా బన్నీ ఎప్పుడూ రెడీగా ఉంటారు.దీనికి తోడు ‘ధృవ’ డైరెక్టర్ సురేందర్ రెడ్డి కావడం కూడా ఓ కారణమే. ఆయన.. తనకూ రేసుగుర్రం లాంటి బ్లాక్‌బస్టర్‌ను ఇవ్వడం.. పైగా సినిమా తెరకెక్కిస్తున్నది సొంత బ్యానర్ గీతా ఆర్ట్స్‌ కావడంతో అల్లు అర్జున్ ఒప్పుకొన్నట్లేనని ఫిల్మ్‌నగర్ టాక్. ఇద్దరూ కలిసి మళ్లీ తెరపై కనిపిస్తే మెగా అభిమానులకు నిజంగా పండగే కదా..!

InCorpTaxAct

If you like to publish news or your story on our website, please email to editor 'at' deccanabroad.com.


    Print       Email

You might also like...

Vanisri Birthday Special on SakshiTV : Aug 3rd 2:30 PM EDT

Read More →