Loading...
You are here:  Home  >  Featured News  >  Current Article

Allu Arjun Teamup with Tamil Director Lingaswamy..?

By   /  March 1, 2016  /  Comments Off on Allu Arjun Teamup with Tamil Director Lingaswamy..?

    Print       Email

Actor-Allu-Arjun 1

తమిళ దర్శకుడు లింగస్వామితో అల్లు అర్జున్ మూవీ..?

InCorpTaxAct
Suvidha

 

 

ప్రస్తుతం స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్‌ ‘సరైనోడు’ సినిమా షూటింగ్ లో బిజీ బిజీగా ఉన్నారు. ఈ సినిమాని వీలైనంత తొందరగా పూర్తి చేయాలని డైరెక్టర్ బోయపాటి శ్రీను భావిస్తున్నారు. ప్రస్తుతం అర్జున్ తో యాక్షన్ సన్నివేశాలను తెరకెక్కిస్తున్నారు. ఇంకా ఈ సినిమా షూటింగ్ జరుగుతుండగానే బన్నీ కాల్షీట్లు కోసం పలువురు దర్శకుడు క్యూ కట్టేశారు. అయితే స్టైలిష్ స్టార్ మాత్రం కాస్త ఆచీ తూచి అడుగులు వేస్తున్నారు. రీసెంట్ గా తమిళ దర్శకుడు లింగస్వామితో సినిమాకి ఒకే చెప్పినట్లు ఫిల్మ్ నగర్ టాక్.

 

చాలామంది టాలీవుడ్ దర్శకులు ఉండగా తమిళ దర్శకుడికి బన్నీ అవకాశం ఇవ్వడం వెనుక ఓ రీజన్ ఉందట. తమిళ దర్శకుడితో చేస్తే తమిళంలో కూడా తన మార్కెట్ పెరుగుతుందని ఈ యంగ్ హీరో ఆలోచనగా తెలుస్తోంది. ఇక సినిమాను అటు తమిళం.. ఇటు తెలుగులో కూడా నిర్మిస్తారని ప్రచారం జరుగుతోంది. అంటే ఇరు భాషల్లో ఏకకాలంలో షూటింగ్ చేస్తారన్న మాట. గీతా ఆర్ట్స్ – స్టూడియో గ్రీన్ బ్యానర్ లో ఈ సినిమా తెరకెక్కనుందని సమాచారం. అయితే దీనికి సంబంధించిన అధికారిక ప్రకటన ఇంకా వెలువడాల్సి ఉంది.

InCorpTaxAct

If you like to publish news or your story on our website, please email to editor 'at' deccanabroad.com.


    Print       Email

You might also like...

Vanisri Birthday Special on SakshiTV : Aug 3rd 2:30 PM EDT

Read More →