Loading...
You are here:  Home  >  Featured News  >  Current Article

Allu Arjun Turns Singer For His Upcoming Film ‘Sarainodu’

By   /  February 15, 2016  /  Comments Off on Allu Arjun Turns Singer For His Upcoming Film ‘Sarainodu’

    Print       Email

ALLU ARJUN - NEW 1

సరైనోడు మూవీ కోసం సాంగ్ పాడిన బన్నీ..?

InCorpTaxAct
Suvidha

 

ప్రస్తుతం మెగా హీరోల్లో వరుస హిట్స్ తో దూసుకెళ్తున్న హీరో ఎవరంటే.. ఠక్కున బన్నీ పేరు చెబుతారు అభిమానులు. అల్లు అర్జున్ వరుస హిట్స్ కు కారణం ఆయన వైవిధ్యమైన పాత్రలు సెలక్ట్ చేసుకోడమేనని సినీ విశ్లేషకులు కూడా భావిస్తున్నారు. తను చేసే ప్రతి క్యారెక్టర్ తన అభిమానులను ఆకట్టుకోవాలని ఎప్పుడూ బన్నీ తపన పడుతూంటారు. అదే ఆయనకు సక్సెస్ లు తెచ్చి పెడుతోంది. ఇలా ఆయన వరుసగా మూడు సినిమాలను ఏకంగా 50 కోట్ల మార్క్ దాటించేశారు.

ఎప్పుడు కొత్తదనం కోసం తపన పడే అర్జున్.. ఈసారి సింగర్ అవతారం ఎత్తబోతున్నారు. బోయపాటి శ్రీను డైరెక్షన్ లో వస్తున్న ‘సరైనోడు’ మూవీలో అల్లు అర్జున్ తన గొంతు సవరించుకోబోతున్నారట. ఇక.. దీనికి సంబంధించిన రికార్డింగ్ కూడా రీసెంట్ గా పూర్తైనట్లు సమాచారం. ఇప్పటికే పలువురు హీరోలు తమ గొంతు వినిపించారు. తాజాగా వారి కోవలోకి అల్లువారి అబ్బాయి కూడా చేరిపోయారట. థమన్ డైరెక్షన్ లో బన్నీ.. సరిగమలు పలికించారట. ఆయన పాడిన పాట కూడా ఏదో సాదా సీదా సాంగ్ కాదని.. పక్కా మాస్ బీట్ ఉన్న పాట అని చిత్ర యూనిట్ సభ్యులు చెబుతున్నారట. మరి బన్నీ ట్రైల్ ఎంతవరకు సక్సెస్ అవుతుందో చూడాలి. ‘సరైనోడు’ మూవీలో అల్లు అర్జున్ సరసన రకుల్ ప్రీత్ సింగ్, కేథరిన్ త్రేసా హీరోయిన్లుగా కనిపించనున్నారు.

InCorpTaxAct

If you like to publish news or your story on our website, please email to editor 'at' deccanabroad.com.


    Print       Email

You might also like...

Vanisri Birthday Special on SakshiTV : Aug 3rd 2:30 PM EDT

Read More →