పర్యావరణ అనుమతుల పిటిషన్ పై విచారణ వాయిదా
ఏపీ రాజధాని అమరావతికి పర్యావరణ అనుమతులను వ్యతిరేకిస్తూ పిటిషన్ దాఖలైంది.ఈ పిటిషన్‌పై విచారణను నేషనల్ గ్రీన్ ట్రైబ్యునల్ ఏప్రిల్ 4కు వాయిదా వేసింది. పూర్తి నివేదికను తీసుకురావాలని సూచించింది. ఆ నివేదికతో తదుపరి విచారణకు హాజరుకావాలని ఏపీ ప్రభుత్వానికి ట్రైబ్యునల్ ఆదేశాలు జారీ చేసింది. పిటిషనర్ కోర్టులో పోరాడేందుకు ఫేస్బుక్ ద్వారా విరాళాలు సేకరిస్తున్నారని ఏపీ న్యాయవాదులు కోర్టు దృష్టికి తీసుకెళ్లారు. విరాళాల సేకరణపై క్షమాపణ చెప్పాలని పిటిషనర్‌కు ఎన్జీటీ ఆదేశించింది. దీంతో పిటిషనర్ శ్రీమన్నారాయణ కోర్టు బేషరతుగా క్షమాపణ తెలియజేశారు. పిటిషన్ కొట్టివేయాలని ఏపీ తరపు న్యాయవాదులు కోరారు. అయితే న్యాయవాదుల అభ్యర్థనను ఎన్టీటీ తోసిపుచ్చింది.ఓ వ్యక్తి న్యాయపోరాటాన్ని హరించలేమని తేల్చి చెప్పింది.
If you like to publish news or your story on our website, please email to editor 'at' deccanabroad.com.