`అమరావతి`మట్టి నీటిపాలు
ప్రపంచం గర్వించదగ్గ రాజధానిని నిర్మిస్తామని చంద్రబాబు ఎన్నో సార్లు చెప్పాడు. మరి అంత గొప్ప రాజధాని నిర్మాణ శంకుస్థాపన అంటే అదిపోవాలి అన్నట్లుగా దాదాపు రూ.250 కోట్లు పైగా ఖర్చు పెట్టి నభూతోనభవిష్యతి అన్నట్లుగా నిర్వహించారు. అంతే కాదు రాజధాని నిర్మాణంలో ప్రతి ఒక్కరూ భాగస్వాములు కావాలని, ప్రతి ఒక్కరూ బాధ్యతకు పిడికెడు మట్టి.. చెంబు నీళ్లు తీసుకురావాలని కూడా బాబు పిలుపునిచ్చారు. ఈ నేపథ్యంలో శంకుస్థాపన రోజు ప్రజలు ప్రతి గ్రామం నుంచి మట్టి నీళ్లను తీసుకువచ్చారు. ఇంత వరకు బాగానే ఉన్నా తర్వాత దాన్ని పట్టించుకునే నాథుడే లేడు. శంకుస్థాపన ప్రాంతం.. యాగశాల.. అక్కడ ఏర్పాటు చేసిన దేవతామూర్తులు.. అఖండ జ్యోతి విషయంలో ఎన్ని జాగ్రత్తలు తీసుకోలేదు. అఖండ జ్యోతి ఆరిపోకుండా చర్యలు తీసుకోవాల్సి ఉంది. దురదృష్టవశాత్తు ఈ జ్యోతి ఎప్పుడో ఆరిపోయింది. అయితే.. కోటప్ప కొండకు తరలించటం ద్వారా అఖండజ్యోతి ఆరిపోలేదని చెప్పినా.. దీన్ని ఏర్పాటు చేసిన చోట ఒక శాశ్విత కట్టటం కట్టి ఉంటే బాగుండేది. కానీ.. అలాంటివేమీ జరగలేదు.
తాజాగా భారీగా వీచిన గాలులకు అఖండ జ్యోతి స్టాండ్ కొట్టుకు పోవటంతో పాటు.. యాగశాల కూలిపోవటం గమనార్హం. ఏపీ గ్రామాల నుంచి తెప్పించిన యాగమట్టి కూడా తడిచిపోతున్న పరిస్థితి. భావోద్వేగాల నడుమ జరిగిన శంకుస్థాపనను వైభవంగా నిర్వహించిన చంద్రబాబు.. అందుకు తగ్గట్లుగా.. ఆ బావనను కలకాలం నిలిచేలా చేయాలే తప్పించి.. చిన్న చిన్న గాలులకే వాటి స్వరూపం మారిపోయేలా ఉండటం సీమాంధ్రుల సెంటిమెంట్ ను తీవ్రంగా ప్రభావితం చేస్తుందన్న విషయాన్ని బాబు గుర్తిస్తే బాగుంటుందన్న అభిప్రాయం వ్యక్తమవుతోంది. కాగా చంద్రబాబు సెంటిమెంటుతో ఆడుకుంటున్నారన్న విమర్శలు వస్తున్నాయని రాజకీయ విశ్లేషకులు అంటున్నారు.
If you like to publish news or your story on our website, please email to editor 'at' deccanabroad.com.