Loading...
You are here:  Home  >  Daily News  >  Current Article

Ambarish recommends his seat to Suma Latha

By   /  April 12, 2018  /  Comments Off on Ambarish recommends his seat to Suma Latha

    Print       Email

నాకొద్దు.. నా భార్య‌కు సీటు ఇవ్వండి

InCorpTaxAct
Suvidha

 

 

 

 

* కాంగ్రెస్ అధిష్టానానికి అంబ‌రీశ్ విజ్ఞ‌ప్తి

డెక్కెన్ అబ్రాడ్‌: కర్ణాటక ఎన్నికలు తీవ్ర ఉత్కంఠను రేపుతున్నాయి. అయితే ప్రముఖ సినీ నటుడు, మాజీ మంత్రి అంబరీశ్‌ ఈ ఎన్నికలకు దూరంగా ఉంటున్నారని తెలుస్తోంది. ప్రస్తుతం ఆయన మండ్య ఎమ్మెల్యేగా కొనసాగుతున్నారు. అయితే గతకొద్ది కాలంగా కాంగ్రెస్‌ పార్టీతో అంటీముట్టనట్లుగా ఉంటున్నారని.. ఎమ్మెల్యే టికెట్‌కు సైతం దరఖాస్తు చేయకపోవడంతో కాంగ్రెస్‌ అధిష్టానం ఆయన్ను పెద్దగా పట్టించుకోలేదు. అనారోగ్య కారణాల దృష్ట్యా తనకు బదులుగా సతీమణి సుమలతకు టికెట్‌ ఇవ్వాలని అంబి కోరుతున్నట్లు విశ్వసనీయ వర్గాల సమాచారం. అయితే రాష్ట్రంలోని సిట్టింగ్‌ ఎమ్మెల్యేలకు టికెట్లు ఇవ్వడానికి కాంగ్రెస్‌ అధిష్టానం మొగ్గు చూపుతున్నట్లు తెలుసుకున్న అంబరీశ్‌ మండ్య నుంచి టికెట్‌ తమకే వస్తుందన్న ధీమాతోనే అర్జీ చేయకుండా మిన్నకుండిపోయారని తెలుస్తోంది. దీంతో కాంగ్రెస్‌ పెద్దలు కూడా రెబెల్‌స్టార్‌ను కరుణించేలా లేరు. అంబరీష్ మీడియా ముందుకొస్తే చాలు ఏదో ఒక సంచలన వ్యాఖ్యలు చేయనిదో వెళ్లరని కర్ణాటకలో సీనియర్ నేతలు చెప్పుకుంటుంటారు.

గత కొద్దిరోజులుగా పార్టీ కార్యక్రమాలకు దూరంగా ఉంటున్న అంబరీష్ ఆఖరి నిమిషంలో తిరుగుబావుటా వేసినా ఆశ్చర్యపోనక్కర్లేదేమో. అయితే ఆయన్ను వదులుకోవడం సీఎం సిద్ధరామయ్యకు మాత్రం అస్సలు ఇష్టం లేదు. దీంతో అధిష్టానం టికెట్ ఇవ్వనన్నా సరే.. బలవంతంగా ఒప్పించి మరీ టికెట్ ఇప్పించాలని సీఎం తీవ్రంగా శ్ర‌మిస్తున్నారు. సీఎం ఎందుకిలా అంబరీష్ టికెట్ కోసం శ్రమిస్తున్నారనే అనే విషయాన్ని ఆరా తీయగా.. అక్కడ అంబరీష్ తప్ప ఆ నియోజకవర్గంలో మరొకరు నిలబడితే గెలుపు సాధ్యం కాదని అనుమానంతోనే ఇలా చేస్తున్నారని అని తెలిసింది.

InCorpTaxAct

If you like to publish news or your story on our website, please email to editor 'at' deccanabroad.com.


    Print       Email

You might also like...

GATeS 15 th Anniversary and Telangana Formation Day Celebrations

Read More →