Loading...
You are here:  Home  >  Politics  >  Andhra Politics  >  Current Article

Ambati Rambabu fire on AP CM Chandrababu Naidu

By   /  February 22, 2018  /  Comments Off on Ambati Rambabu fire on AP CM Chandrababu Naidu

    Print       Email
బాబు మరో నాటకం మొదలు పెట్టాడు : అంబటి రాంబాబు
ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు మీద వైసిపి పార్టీ సీనియర్ నేత అంబటి రాంబాబు ద్వజమెత్తారు. బాబు ఒక ఊసరవెల్లి అని.. ఎప్పుడు ఎలాంటి మోసాలు చేయాలో బాగా తెలుసని ఆయన అన్నారు. ప్రత్యేక హోదాతో లాభం లేదని తేల్చి చెప్పిన చంద్రబాబు ఆయనే ప్రత్యేక హోదాను చంపేయాలనుకున్నారని అన్నారు. ప్రత్యేక రాష్ట్రాలు పొందిన రాష్ట్రాలు నష్టపోయాయని.. ప్యాకేజీనే మంచిదని చంద్రబాబు ప్రచారం చేశారని అన్నారు.
ఆ సమయంలో కూడా వైసిపి అధ్యక్షుడు వైఎస్ జగన్ ప్రత్యేక హోదా చేసేందుకు ఉద్యమాలు చేశారని గుర్తు చేశారు. ఇప్పటికి సభలు, సమావేశాలతో ప్రజలను చైతన్యవంతులను చేసేది జగన్ మాత్రమే అని అన్నారు. ప్రత్యేక హోదా కోసం ఎంపీలు రాజీనామా చేస్తారని జగన్ చెప్పారని  మరోసారి గుర్తు చేశారు. ఇక ఈ ఉద్యమం ముదురుతున్న సమయంలో చంద్రబాబు మరో నాటకానికి తెరలేపుతున్నారని అన్నారు.
InCorpTaxAct

If you like to publish news or your story on our website, please email to editor 'at' deccanabroad.com.


    Print       Email

You might also like...

Vanisri Birthday Special on SakshiTV : Aug 3rd 2:30 PM EDT

Read More →