Loading...
You are here:  Home  >  Politics  >  Andhra Politics  >  Current Article

Ambati Rambabu response about Pawan Kalyan Comments

By   /  February 20, 2018  /  Comments Off on Ambati Rambabu response about Pawan Kalyan Comments

    Print       Email

మా అధినేత ఎక్కడా సవాల్ విసరలేదు : అంబటి

 

InCorpTaxAct
Suvidha

 

 

జగన్మోహన్ రెడ్డి సవాల్‌ను స్వీకరిస్తానని పవన్ కల్యాణ్ చెప్పడం అర్ధరాహిత్యమని వైసీపీ నేత అంబటి రాంబాబు అన్నారు. సోమవారం సాయంత్రం మీడియాతో మాట్లాడిన ఆయన.. వైసీపీ అవిశ్వాస తీర్మానం పెడితే తాను మద్దతు సంపాదించేందుకు సిద్ధమని ప్రకటించారు. జగన్‌ సవాల్‌కు సమాధానం చెప్పేందుకే తాను ఈ మీడియా సమావేశం ఏర్పాటుచేసినట్టు స్పష్టంచేశారు. వైసీపీ మార్చి 5న అవిశ్వాస తీర్మానం నోటీసు ఇవ్వాలని సూచించిన పవన్.. తాను 4న ఢిల్లీకి వస్తానని తెలిపారు.

సీపీఐ, సీపీఎం, బీజేడీ, ఆమ్‌ ఆద్మీ, టీడీపీ, తదితర పార్టీలకు చెందిన ఎంపీల మద్దతు సంపాదిస్తానని చెప్పారు. దీనిపై స్పందించిన అంబటి అసలు జగన్ ఎక్కడా సవాల్ ఇవ్వలేదని.. మీరిచ్చిన సలహాను ఏ ఉద్దేశ్యంతో ఇచ్చినా తీసుకుంటామని మాత్రమే చెప్పారని.. కావాలంటే వీడియోను మళ్లీ చూసుకోండి అంటూ చెప్పారు. సవాల్ చేయకపోయినా సవాల్‌ను స్వీకరిస్తున్నామని చెప్పడమేంటో అర్థం కాలేదని ఆయన ఎద్దేవా చేశారు. ఇక ప్రతి విషయంలోనూ తమ చిత్తశుద్ధిని ప్రశ్నిస్తున్న పవన్ కల్యాణ్.. చంద్రబాబును మాత్రం ఎలా నమ్ముతున్నారో అర్థం కావడం లేదని వ్యాఖ్యానించారు.

InCorpTaxAct

If you like to publish news or your story on our website, please email to editor 'at' deccanabroad.com.


    Print       Email

You might also like...

Vanisri Birthday Special on SakshiTV : Aug 3rd 2:30 PM EDT

Read More →