Loading...
You are here:  Home  >  Daily News  >  Current Article

Amit Shah lose talk damaged BJP image

By   /  March 28, 2018  /  Comments Off on Amit Shah lose talk damaged BJP image

    Print       Email

నోరు జారీ చిక్కుల్లో ప‌డ్డ అమిత్ షా

InCorpTaxAct
Suvidha

 

 

 

 

* సిద్ధ‌రామ‌య్య‌పై ఆరోప‌ణ‌లు చేయ‌బోయి య‌డ్డూర‌ప్ప‌పై చేసిన షా

* బీజేపీ శ్రేణులకు ఇబ్బంది క‌రంగా మారిన షా వ్యాఖ్య‌లు

* మీరు నిజ‌మే మాట్లాడారంటూ రాహుల్ గాంధీ ట్వీట్‌

డెక్క‌ణ్ అబ్రాడ్‌: ఈ మ‌ధ్య పార్టీల నాయ‌కులు పోర‌పాటు మాట్లాడ‌డం.. వాటిని స‌రిచేసుకునే లోపే సోష‌ల్ మీడియాలో వైర‌ల్ కావ‌డం అప్ప‌టికే జ‌ర‌గాల్సిన న‌ష్టం జ‌రిగిపోవ‌డం మ‌నం చూస్తూనే ఉన్నాం. తాజాగా అమిత్‌షా కూడా అలాపొర‌పాటున మాట్లాడి వార్త‌ల్లో నిలిచారు. వివ‌రాల్లోకి వెళ్లితే…బీజేపీ జాతీయ అధ్యక్షుడు అమిత్ షా నోరుజారారు. కర్ణాటకలో సిద్ధరామయ్య సర్కారుపై అవినీతి ఆరోపణలు చేసే ఉద్దేశంతోనే యడ్యూరప్ప ప్రభుత్వంపై అవినీతి ఆరోపణలు గుప్పతించారు.  కర్ణాటకలో అవినీతి ప్రభుత్వం ఎవరిదో పోటీపెడితే యడ్యూరప్ప సర్కారు మొదట నిలుస్తుందని ఆయన పొరబాటున వ్యాఖ్యలు చేశారు. బీజేపీ సీఎం అభ్యర్థి యడ్యూరప్ప పక్కనుండగానే అమిత్ షా ఈ వ్యాఖ్యలు చేశారు. అమిత్ షా పొరబాటున చేసిన ఈ వ్యాఖ్యలు కర్ణాటక బీజేపీ శ్రేణులకు ఇబ్బందికరంగా మారాయి.  పక్కనున్న బీజేపీ నాయకుడు అమిత్ షాకు జరిగిన తప్పును ఎత్తిచూపడంతో…దాన్ని సరిచేసుకున్న బీజేపీ అధ్యక్షుడు అవినీతిలో సిద్ధరామయ్య ప్రభుత్వం ఫస్ట్ వస్తుందని విమర్శించారు.

అయితే అప్పటికే జరగాల్సిన నష్టం జరిగిపోయింది. అంది వచ్చిన అవకాశాన్ని తామెందుకు వదులుకుంటామంటూ…అమిత్ షా వీడియోను సోషల్ మీడియాలో కాంగ్రెస్ శ్రేణులు జోరుగా ప్రసారం చేస్తున్నాయి. చివరకు మీరు నిజమే మాట్లాడారంటూ సిద్ధరామయ్య…అమిత్ షా కామెంట్స్‌పై స్పందించారు. అటు కాంగ్రెస్ అధ్యక్షుడు రాహుల్ గాంధీ…అమిత్ షా వీడియోను తన ట్విట్టర్ ఖాతాలో షేర్ చేశారు. అలాగే కర్ణాటక కాంగ్రెస్, సంజయ్ ఝా, దివ్య స్పందన తదితరులు అమిత్ షా పొరబాటున చేసిన కామెంట్స్ వీడియోను తమ ట్విట్టర్ ఖాతాలో షేర్ చేశారు.

InCorpTaxAct

If you like to publish news or your story on our website, please email to editor 'at' deccanabroad.com.


    Print       Email

You might also like...

Vanisri Birthday Special on SakshiTV : Aug 3rd 2:30 PM EDT

Read More →