Loading...
You are here:  Home  >  Daily News  >  Current Article

Amit Shah meets with Shiv Sena in the Presidential elections..

By   /  June 19, 2017  /  Comments Off on Amit Shah meets with Shiv Sena in the Presidential elections..

    Print       Email

రాష్ట్రపతి అభ్యర్థి విషయంలో శివసేనతో అమిత్ షా మంతనాలు..

 

Suvidha
Biryani Pot

 

 

రాష్ట్రపతి అభ్యర్ధి విషయంలో ఎన్డీయే త్రిసభ్య ప్యానెల్ ను వేసింది. ఈ ప్యానెల్ సభ్యులు విపక్షాలు, మిత్ర పక్ష పార్టీల అభిప్రాయాలను తెలుసుకుంటోంది. ఇందులో భాగంగా బీజేపీ జాతీయాధ్యక్షుడు అమిత్ షా శివసేన చీఫ్ ఉద్దవ్ థాకరేను కలిశారు. శివసేనతో బీజేపీకి కొన్ని రోజులుగా విభేదాలు ఉన్న విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలో వీరి భేటీకి ప్రాధాన్యత చేకూరింది. ఎన్డీయే అభ్యర్ధికి మద్దతు ఇవ్వాలని అమిత్ షా వారిని కోరారు.

వీరి భేటీ దాదాపుగా గంటపాటు సాగింది. వీరి భేటీకి థాకరే కుమారుడు ఆదిత్యా థాకరే, మహారాష్ట్ర సీఎం దేవేంద్ర ఫడ్నవీస్ కూడా హాజరయ్యారు. ఇటీవల ఎన్డీఏ తరపున అభ్యర్థిగా ఆరెస్సెస్‌ చీఫ్‌ మోహన్‌ భగవత్‌ పేరును శివసేన సూచించిన విషయం తెలిసిందే. ఒకవేళ భగవత్‌ అభ్యర్థిత్వానికి బీజేపీ ఒప్పుకోకపోతే వ్యవసాయ శాస్త్రవేత్త ఎంఎస్‌ స్వామినాథన్‌ పేరును పరిశీలించాల్సిందిగా శివసేన కోరింది. మరోవైపు రాష్ట్రపతి అభ్యర్థిత్వానికి విపక్షాల ఏకాభిప్రాయాన్ని సాధించేందుకు కేంద్ర మంత్రులు రాజ్‌నాథ్‌ సింగ్‌, వెంకయ్యనాయుడు కాంగ్రెస్‌, సీపీఎం, ఎన్సీపీ, ఎస్పీ పార్టీల నేతలను కలిసి చర్చలు జరిపిన విషయం తెలిసిందే.

Charter Global
Swapna
InCorpTaxAct

If you like to publish news or your story on our website, please email to editor 'at' deccanabroad.com.


    Print       Email

You might also like...

Invitation For World Telangana Convention 2018 – June 29th, 30th and July 1st Houston, TX

Read More →