Loading...
You are here:  Home  >  Politics  >  Andhra Politics  >  Current Article

Amit Shah weighs in on ‘Bharat Mata Ki Jai’ row, says 99 percent people will agree to chant slogan

By   /  March 18, 2016  /  Comments Off on Amit Shah weighs in on ‘Bharat Mata Ki Jai’ row, says 99 percent people will agree to chant slogan

    Print       Email

amith shah

‘భారత్ మాతాకీ జై’ అనేందుకు 99 శాతం మంది ఇష్టపడతారు: అమిత్ షా

InCorpTaxAct
Suvidha

 

ఇండియాలో 99శాతం మంది ‘భారత్‌ మాతాకీ జై’ అనేందుకు గర్వపడతారని బీజేపీ జాతీయాధ్యక్షుడు అమిత్ షా అన్నారు. తాము భారతీయులమని చెప్పుకోనేందుకు ఎంతో ఇష్టపడతారని చెప్పారు. ఆ మిగిలిన ఒకశాతం మాత్రమే వివాదాలకు కారణమవుతుంటారని అభిప్రాయపడ్డారు. అలాంటి వారే అఫ్జల్‌గురులాంటి వారి కోసం దేశ వ్యతిరేక కార్యక్రమాలు చేపడతారని విమర్శలు గుప్పించారు. శుక్రవారం ఆయన ఇండియాటుడే కన్‌క్లేవ్‌లో ప్రసంగించారు.

బీజేపీ, ఆరెస్సెస్‌ బలవంతం వల్ల ఎవరూ భారత్‌ మాతాకీ జై అనాల్సిన అవసరం లేదన్నారు. ఎందుకంటే తాము అధికారంలోకి వచ్చాక ఆ నినాదం రాలేదని గుర్తు చేశారు. ఆ నినాదం ఎప్పుడో ప్రజల గుండెల్లోంచి వచ్చిందన్నారు. అస్సాంలో తప్పక ప్రభుత్వాన్ని ఏర్పాటు చేస్తామని ఈ సందర్భంగా ఆయన ధీమా వ్యక్తం చేశారు. అలాగే అసెంబ్లీ ఎన్నికలు జరిగే మిగిలిన నాలుగు రాష్ట్రాల్లోనూ పార్టీ బలోపేతం చేస్తామన్నారు.బీజేపీ విస్తరించేందుకు కృషి చేస్తామన్నారు. జేఎన్‌యూ విషయంలో బీజేపీ రైట్ వేలోనే వెళ్తోందన్నారు. అందులో ఎలాంటి సందేహమూ లేదని అమిత్‌ షా స్పష్టం చేశారు.

InCorpTaxAct

If you like to publish news or your story on our website, please email to editor 'at' deccanabroad.com.


    Print       Email

You might also like...

Vanisri Birthday Special on SakshiTV : Aug 3rd 2:30 PM EDT

Read More →