నడిరోడ్డుపై హ్యాపీగా తిరిగేసిన ప్రముఖ సెలబ్రిటీ..!
సెలబ్రిటీలు సామాన్య వ్యక్తుల నడిరోడ్డుపైకి రాగలరా..? అందరిలా హ్యాపీగా నడుస్తూ ప్రకృతి అందాలను వీక్షిస్తూ ఎంజాయ్ చేయగలరా..? అంటే ఠక్కున కష్టం అని చెప్పేస్తాం. అందులోనూ ప్రముఖ సినిమా స్టార్ కి అయితే ఇది మరింత కష్టమైన పనే. ఎందుకంటే తమ అభిమాన నటుడిని దూరం నుంచి చూసినా అభిమానులు గుర్తుపట్టేస్తారు. ఆటోగ్రాఫ్ ల కోసం సెల్ఫీల కోసం చుట్టుముడతారు. తమ అభిమానంతో ఉక్కిరి బిక్కిరి చేసేస్తారు.
కాని ఓ ప్రముఖ బాలీవుడ్ స్టార్ మాత్రం జనం కంటికి కనిపించకుండా ఢిల్లీ నడివీధుల్లో నడుచుకుంటూ తిరిగేశారు. తమ పక్కనుంచి అభిమాన నటుడు రోడ్డు దాటుతున్నా ఎవరూ గుర్తించలేకపోయారు. ఇంతకీ ఆయన ఎవరు..? ప్రముఖ బాలీవుడ్ స్టార్ అమితాబ్ బచ్చన్ అభిమానుల కంట పడకుండా ఢిల్లీ వీధుల్లో తిరుగుతూ తన సరదా తీర్చుకున్నారు. ఓ సామాన్య వ్యక్తిలా నడుచుకుంటూ తిరిగేశారు. దీనికోసం ఆయన కొన్ని జాగ్రత్తలు తీసుకున్నారు. ఎవరూ గుర్తు పట్టకుండా ఉండటం కోసం ఖాకీ ప్యాంటు ధరించారు. ముఖానికి మాస్క్ వేసుకున్నారు.
సూజిత్ సిర్క నయా ప్రాజెక్ట్ కోసం ఢిల్లీ వెళ్ళిన బిబ్ బీ దేశ రాజధాని అందాలను నడుచుకుంటూ ఆస్వాదించారు. అనంతరం రాజధాని విశేషాలను ఆయన తన బ్లాగ్ లో అభిమానులతో పంచుకున్నారు. దీంతో పాటు ఖాకీ ప్యాంటు, చొక్కా, ట్రెయినింగ్ మాస్క్ ధరించి నడుస్తున్న ఫొటోలను తన బ్లాగ్ లో పోస్ట్ చేశారు. అయితే తనను ఎవరూ గుర్తు పట్టలేదని తెలిపారు. మాస్క్ ఉండటంతో తనన ఎవరూ కన్నెత్తి కూడా చూడలేదన్నారు. తాను కోరుకున్నది కూడా ఇదేనని చెప్పుకొచ్చారు. గుర్తు పట్టే అవకాశం ఉన్న సందర్భాల్లో కూడా ఎవరూ అందుకు ప్రయత్నించలేదన్నారు. ఓ ఫొటోలో ఆయన అత్యంత రద్దీగా ఉన్న జంక్షన్ దాటుతూ కనిపించారు. తాను సిటీలో దాటిన అత్యంత రద్దీ రహదారుల్లో ఇది ఒకటి అని బ్లాగులో తెలిపారు. తనను ఎవరూ గుర్తు పట్టకుండా ఉండేలా మేకప్ వేసిన ఆర్టిస్ట్ ని అమితాబ్ బచ్చన్ ప్రశంసించారు.
If you like to publish news or your story on our website, please email to editor 'at' deccanabroad.com.