Loading...
You are here:  Home  >  Politics  >  Andhra Politics  >  Current Article

Anam Vivekanandha Reddy health is deteriorating

By   /  April 14, 2018  /  Comments Off on Anam Vivekanandha Reddy health is deteriorating

    Print       Email

ఆందోళ‌న‌క‌రంగా ఆనం ఆరోగ్య ప‌రిస్థితి

Suvidha
Biryani Pot

 

 

 

* ప్ర‌త్యేక వైద్యాన్ని అందిస్తున్న డాక్ట‌ర్లు

* ఆనంను ప‌రామ‌ర్శించి ఏపీసీఎం చంద్ర‌బాబు

డెక్క‌న్ అబ్రాడ్‌: ఆంధ్రప్రదేశ్ లో ఆనం బ్రదర్స్ అంటే తెలియని వారు ఉండరు. ముఖ్యంగా ఆనం వివేకానంద రెడ్డి అంటే ప్రత్యేకం..ముక్కుసూటిగా మాట్లాడటం..ఎలాంటి వారినైనా చివరకు సొంత పార్టీ నేతలనైనా ఏకి పారేయడం..కాంట్రవర్సీలు సృష్టించడం తెలిసిన విషయమే. గత కొంత కాలంగా  ఆనం వివేకానందరెడ్డి రాజకీయాల్లో సైలెంట్ గా ఉన్నారు.  ప్రస్తుతం ఏపిలో ప్రత్యేక హోదా ఉద్యమం తీవ్రతరం అయ్యింది..కానీ ఆనం మాత్రం ఇప్పటికీ ఒక్క మాట కూడ మాట్లాడలేదు..దీనికి కారణం ఆయన ఆరోగ్య పరిస్థి అని అంటున్నారు టీడీపీ వర్గం.  అంతే కాదు ప్రస్తుతం ఆయన ఆరోగ్యం మరీ క్షీణించడంతో హైదరాబాదులోని కిమ్స్ ఆసుపత్రిలో చేర్పించారు. ఆయన పరిస్థితి ఆందోళనకరంగా ఉంది. ఈ నేపథ్యంలో, ఆయనకు వైద్యులు ప్రత్యేక వైద్యాన్ని అందిస్తున్నారు.

ఆనం వివేకానంద‌రెడ్డి ఆరోగ్య పరిస్థితి గురించి తెలుసుకున్న ఏపీ ముఖ్యమంత్రి చంద్రబాబు కిమ్స్ కు వచ్చి ఆయనను పరామర్శించారు. ఆనం ఆరోగ్య పరిస్థితి గురించి వైద్యులను అడిగి తెలుసుకున్నారు. ఆనం వివేకానందరెడ్డి ఆరోగ్య పరిస్థితి ఆందోళనకరంగా ఉండటంతో ఆయన అభిమానులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.

Charter Global
Swapna
InCorpTaxAct

If you like to publish news or your story on our website, please email to editor 'at' deccanabroad.com.


    Print       Email

You might also like...

Invitation For World Telangana Convention 2018 – June 29th, 30th and July 1st Houston, TX

Read More →