మరోసారి క్వెట్టాలో బాంబు పేలుడు..
పాక్ లో మళ్లీ బాంబు పేలుడు సంభవించింది.మళ్ళీ క్వెట్టా నగరంలో బాంబు దాడి జరిగింది. ఈ సారి అల్ కైర్ ఆస్పత్రి దగ్గర గురువారం ఉదయం భారీ పేలుడు సంభవించింది. ఈ ఘటనలో 12 మంది గాయపడ్డారు. ముష్కరులు ఆస్పత్రిలోని ఓ చిన్న బ్రిడ్జ్ కింద బాంబును అమర్చారు.
బాంబు పేలుడు సమాచారం అందుకున్న పోలీసులు హుటాహుటినా ఆస్పత్రికి చేరుకున్నారు. సహాయక సిబ్బంది ముమ్మర సహాయక చర్యలు చేపట్టారు. క్షతగాత్రులను పలు ఆస్పత్రులకు తరలించారు. ఈ బాంబు దాడి బెలూచిస్థాన్ ఫెడరల్ కోర్టు జడ్జి జహూర్ శివానీ లక్ష్యంగా జరిగినట్లు పోలీసులు అనుమానిస్తున్నారు. రెండు రోజుల క్రితం ఇదే నగరంలోని సివిల్ ఆస్పత్రిలో బాంబు దాడి జరిగిన విషయం తెలిసిందే. ఈ ఘటనలో దాదాపుగా వందమంది గాయపడ్డారు.
If you like to publish news or your story on our website, please email to editor 'at' deccanabroad.com.